మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ నెల 22వ తేదీన పుట్టినరోజు జరుపుకోబోతున్న సందర్బంగా రేపు మెగా అభిమానుల వేడుకలు మొదలుకానున్నాయి. ఒక రోజు ముందే అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా అభిమానులు పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపనున్నారు.
వేడుకకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. శిల్పా కళా వేదికలో బుధవారం సాయత్రం 6గంటలకు వేడుక ప్రారంభం కానుంది.


