వరల్డ్ వైడ్ టాపర్ గా రెబల్ స్టార్ ‘సాహో’ ‘బ్యాడ్ బాయ్’

0
678

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతుండగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ‘బ్యాడ్ బాయ్’ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో సంచనలం సృష్టిస్తోంది.

కలర్ఫుల్ లొకేషన్స్ లో లేటెస్ట్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ప్రభాస్ తో కలిసి, బాలీవుడ్ భామ జాక్వలీన్ ఫెర్నాండేజ్ స్టెప్పులేసిన ఈ క్రేజీ సాంగ్, గడిచిన 24వ గంటల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంచి వీక్షించిన సాంగ్స్ లో ప్రధమ స్థానాన్ని దక్కించుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు కలిగి ఉన్న తమ సినిమా, రేపు విడుదల తరువాత తప్పకుండా ఆ అంచనాలు అందుకుంటుందని, సాహో టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, ఈనెల 30న భారీ స్థాయిలో, అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here