తెలుగు ప్రజలు గర్వించేలా రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సాహో – సైరా నరసింహా రెడ్డి సినిమాలపై అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక రెండు సినిమాల్లో నటించిన స్టార్స్ పక్కపక్కనే కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కలిసున్న ఫొటో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.
రీసెంట్ గా బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లిన సైరా యూనిట్ అక్కడ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది. ఇక ప్రభాస్ కూడా సాహో సినిమా ప్రమోషన్ లో భాగంగా రోజు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అనుకోని విధంగా ప్రభాస్ మెగాస్టార్ ని అలాగే రామ్ చరణ్ ని కలిసి టీజర్ చాలా బావుందని శుభాకాంక్షలు తెలియజేశారు. సాహో సినిమా ఈ నెల 30న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


