యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ విద్యావేత్త కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగాఆగస్ట్ 2న విడుదల చేశారు. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సూపర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్‌తో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ – ”ఒక మంచి సినిమాను తీస్తే ప్రోత్సహించి నేను నిర్మాతగా ఉండడానికి కారణమైన మీడియా సభ్యులకి నా వందనాలు. మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత 5సంవత్సరాలుగా 7 సినిమాలు చేశాడు. అందులో చాలా మంది హీరోలకి తీసిపోని విధంగా ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్స్‌తో 34కోట్ల షేర్‌ను రాబట్టిన సినిమా ‘అల్లుడు శీను’. గ్రాండ్‌గా ఉండే అన్ని కమర్షియల్ అంశాలతో వి.వి.వినాయక్ డైరెక్షన్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తరువాత బోయపాటి శ్రీనుతో `జయజానకి నాయక` సినిమా చేయడం జరిగింది. అది కూడా భారీ కాస్టింగ్, భారీబడ్జెట్‌మూవీ. అవన్నీ దర్శకుడికి, కాస్టింగ్‌కి మంచి పేరు వచ్చింది..కానీ ‘రాక్షసుడు’ సినిమా మా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మంచి పేరు తెచ్చి… రెవిన్యూ పరంగా కూడా సూపర్ హిట్ అయింది.
ఈ రోజున నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అయింది. సినిమా నిర్మాణం స్టార్ట్ చేసి 21 ఏళ్ళు అయింది. నా కెరీర్‌లో 25 స్ట్రెయిట్ సినిమాలు, 8 డబ్బింగ్ సినిమాలు తీశాను. కానీ అవేమి నాకు ఆనందాన్ని ఇవ్వలేదు.. ఈరోజు మా అబ్బాయి చేసిన ” రాక్షసుడు” అందరి ప్రశంసలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. శనివారం 85 శాతం అక్యుపెన్సీ ఉండగా.. ఆదివారం నాటికి 100 శాతం అక్యుపెన్సీ ఉండింది. ఇంత మంచి సినిమా తీసిన కెఎల్ యూనివర్సిటీ కోనేరు సత్యనారాయణ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా సోల్ ఎక్కడా మిస్ కాకుండా, తమిళ్ టెంపోకి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా తెరకెక్కించిన రమేష్ వర్మ గారికి థాంక్స్. ఈ సినిమా కెమెరామెన్ వెంకట్ కి హాట్స్‌ఆఫ్. బెల్లంకొండ శ్రీనివాస్‌ని అందంగా, యూత్‌ఫుల్‌గా చూపించాడు. అలాగే చిత్ర యూనిట్ అందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయి గత చిత్రాలు కూడా నాకు రెవిన్యూ పరంగా సూపర్‌డూపర్‌హిట్ అయ్యాయి. హిందీలో కూడా మంచి ప్రేక్షకాదరణ కలిగిన సినిమాలు బెల్లంకొండ సాయి కి ఉన్నాయి. ఈ విషయం మీరు యుట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు. ‘స్పీడున్నోడు’ 200 మిలియన్స్, ‘జయజానకినాయక’ 140 మిలియన్స్, ‘కవచం’ 125 మిలియన్స్, ‘అల్లుడుశీను’ లేట్‌గా యూట్యూబ్‌లో పెట్టినా దాదాపు 100 మిలియన్స్ వ్యూస్ దాటింది. ఇలా హిందీలో 200 మిలియన్స్ మంది చూసిన సినిమాలు బెల్లంకొండ శ్రీనివాస్‌కి 2 ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడ అవి సూపర్ హిట్ కాలేకపోయాయి. అయితే ఇప్పుడు కోనేరు సత్యనారాయణ అనుకున్న టైంకి సినిమాను విడుదల చేసి ఫస్ట్ టైం 100 ప్రీమియర్ షో లు యూ.ఎస్‌లో వేశారు. అక్కడా అద్భుతమైన టాక్‌తో మంచి రెవిన్యూ సాధించింది. నేను స్టేజి ఎక్కి 5సంవత్సరాలు అయింది. మొన్న రాక్షసుడు ప్రీ రిలీజ్‌లో స్టేజ్ ఎక్కాను. మళ్ళీ ఆ సినిమా కోసం నేడు స్టేజి ఎక్కాను.
ఈ ‘రాక్షసుడు’ సినిమా నుండి మా అబ్బాయి ప్రతి సినిమాకి జర్నలిస్టు అసోసియేషన్‌కి 10 లక్షలు విరాళంగా ఇస్తాను. ఇది మా అబ్బాయి ప్రతి సినిమాకు కొనసాగుతుంది.
అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ….
బెల్లంకొండ శ్రీనివాస్‌కి హిందీలో హ్యుజ్ మార్కెట్ ఉంది అన్నారు కదా! అక్కడ స్ట్రయిట్ సినిమా తీసే అవకాశం ఉందా?
– నేను తీయడం కాదండీ, ఈ రోజే నాకు ఒక మెయిల్ రావడం జరిగింది. అదేంటంటే ఎన్నో హిందీతో పాటు హాలీవుడ్ సినిమాలు నిర్మించిన ఒక పెద్ద నిర్మాణ సంస్థ మీ అబ్బాయితో హిందీలో స్ట్రయిట్ సినిమా తీస్తాం అన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాం. ఇది కానీ పక్షంలో నేనే ఒక స్ట్రయిట్ సినిమాను హిందీలో నిర్మిస్తాను.
ఈ సినిమాకు మీరు నిర్మాతగా లేరు కదా?
– అలా అనేం లేదండి. నేను లేకుండా చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ మా అబ్బయి నటుడిగా భవిష్యత్‌లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ సినిమా విజయం తోడ్పడుతుంది. డాన్స్‌లు, ఫైట్స్‌తో పాటు నటనలో కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చే సినిమా ఇచ్చినందుకు నిర్మాత కోనేరు సత్య నారాయణ గారికి పాదాభివందనం. అలాగే బడ్జెట్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లొకేషన్స్‌లో సినిమా తీసిన రమేష్ వర్మని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
రాక్షసుడు సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
– మీరందరూ చూస్తున్నారు కదా! ఐదు సంవత్సరాల తరువాత మీ ముందుకు వచ్చాను అంటేనే అర్ధం చేసుకోవచ్చు. అంత సూపర్ హిట్ అయింది కాబట్టే ౖరాక్షసుడు’ ప్రమోషన్స్ కోసం ధైర్యంగా మీ ముందుకు రాగలిగాను. మంచి ప్రమోషన్స్‌తో ఒక రేంజ్ రెవిన్యూ సాధించాలని కోరుకుంటున్నాను.
సినిమా రెవిన్యూ ఎంత వచ్చింది?
– నంబర్స్ ముఖ్యంకాదు. ఈ సినిమా వైజాగ్,ఈస్ట్ నేనే కొన్నాను. నేను ప్రొడ్యూసర్‌కి ఇచ్చిన డబ్బు నాకు ఈ రోజుతోనే వచ్చింది. ఇక మీద వచ్చేది అంతా లాభాలు, కమిషన్లు.. అంటేనే అర్ధం అవుతుంది ఈ సినిమా ఎంతలా కలెక్ట్ చేస్తుందో..
నెక్స్ట్ సినిమా మీ బ్యానర్ లోనే ఉంటుందా?
– మంచి కథలు విటున్నాం. ఇప్పటి నుండి మంచి కథలే చేయాలని నిర్ణయించుకున్నాం. అలా మంచి సినిమాలు తీసే నిర్మాత దిల్ రాజు గారి బ్యానేర్‌లో సాయి తదుపరి చిత్రం ఉంటుంది.ఆయన కూడా సాయి కోసం మంచి కథను రెడీ చేయిస్తున్నారు.
సాయి బలం, బలగం ఫైట్స్, డాన్స్ లు కదా ! అవేమి లేకుండా సినిమా తీయడం రిస్క్ అనిపించిందా?
– ఈ సినిమా రైట్స్ కోసం కూర్చున్నపుడు కొంతమంది నిర్మాతలు నాకు ఇదే విషయం చెప్పడం జరిగింది. మంచి సినిమా అంటే ఫైట్స్,డాన్స్లులు కాదు. మంచి కథ అని అర్ధం. అదే నమ్మకంతో ఈ సినిమాను చేశాను. ఆ నమ్మకంతోనే నా కల నిజమైంది. మా అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ నుండే హీరో కావాలని డాన్స్‌లు ఫైట్స్ నేర్చుకున్నాడు. యాక్టింగ్ లో కూడా విదేశాలలో కష్టపడి శిక్షణ తీసుకున్నాడు. అలా సిన్సియారిటీతో మంచి సినిమాలు తీస్తుంటే ఏ రోజుకైనా సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. ‘రాక్షసుడు’ విజయంతో రుజువైంది.