శేష్ కి ‘గూఢచారి’ సినిమాలాగే ‘ఎవరు’ కూడా పెద్ద హిట్ అవుతుంది – నాచురల్ స్టార్‌ నాని

0
936

నటుడు, రచయిత ఇలా మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌గా టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యంగ్‌ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం అయన హీరోగా నటిస్తున్న సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను పి.వి.పి సినిమా బ్యానర్‌పై ప్రసాద్‌ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, కెవిన్‌ అన్నే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెజినా కసాండ్ర, నవీన్‌ కృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల సమంత విడుదల చేసిన టీజర్‌ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ సంపాదించింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం ట్రైలర్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో టాలీవుడ్‌ న్యాచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

న్యాచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ – ” ఇది తెలుగు సినిమానా, హిందీ సినిమానా అనేంత రేంజ్‌లో ట్రైలర్‌ ఉంది. ఆ సస్పెన్స్‌ ఏంటో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ పెరిగింది. 1:40నిమిషాల ట్రైలర్‌లోనే ఎందుకు ఆ సస్పెన్స్‌? అసలు ఏం చూశాం? అనే షాక్‌లో ఉన్నాను. ఈ టీం అందరూ నాకు చాలా క్లోజ్‌. ‘గూఢచారి’ సినిమా ట్రైలర్‌ కూడా ఇదే ప్లేస్‌లో లాంచ్‌ చేశాం. సినిమా పెద్ద హిట్‌ అయింది. ప్రస్తుతం ‘ఎవరు’ సినిమా ట్రైలర్‌ కూడా ఇక్కడే, నేనే లాంచ్‌ చేశాను కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది. రెజినా నేను ప్రొడ్యూస్‌ చేసిన ‘అ!’ సినిమాలో నటించింది. చాలా గట్స్‌ ఉన్న యాక్ట్రెస్‌. చాలా ఇంపాక్ట్‌ ఉన్న క్యారెక్టర్‌ని డేరింగ్‌గా చేసింది. ‘ఎవరు’ టీజర్‌, ట్రైలర్‌ చాలా ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేశాయి. తప్పకుండా అందరూ థియేటర్‌లో సినిమా చూడండి” అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకట్‌ రామ్‌జి మాట్లాడుతూ – ” మా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసిన నాని గారికి థాంక్స్‌. నాకు ఈ అవకాశం ఇచ్చిన శేష్‌ గారికి. పి.వి.పి గారికి కృతజ్ఞతలు. రెజీనా షూట్‌లో ఉండడం రాలేదు. టీజర్‌ రిలీజ్‌ రోజు చెప్పినట్టు ప్రీ రిలీజ్‌ రోజు సినిమా గురించి ఎక్కువ మాట్లాడతాను’ అన్నారు.

హీరో శేష్‌ మాట్లాడుతూ – ”ఎవరు’ నేను నమ్మిన కథ, నాకు నచ్చిన సినిమా.. మంచి కంటెంట్‌ ఉంది కాబట్టే నాని గారిని ట్రైలర్‌ లాంచ్‌కి పిలవడం జరిగింది. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలో మనుషులు రెండు రకాలుగా ఉంటారు, రెండు రకాలుగా ఆలోచిస్తారు. వంశీ ఫెంటాస్టిక్‌ ఫ్రేమ్స్‌ ఇచ్చాడు. పి.వి.పి గారు నన్ను హీరోగా ఎవ్వరు నమ్మని టైమ్‌లో నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అబ్బూరి రవి నా ‘పంజా’, ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలకు రచయితగా చేశాడు. మళ్ళీ ‘ఎవరు’ సినిమాకు కలిసి పనిచేశాం. ఈ సినిమాకూడా తప్పకుండామంచి విజయం సాధిస్తుంది. ఆగష్టు 15న థియేటర్‌లో కలుద్దాం” అన్నారు.

రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ – ” పి.వి.పి గారితో ‘క్షణం’ నుండి ట్రావెల్‌ చేస్తున్నాను. దర్శకుడు రామ్‌జీ ఈ కథను గుర్తు పెట్టుకొని నేరేట్‌ చేయడం గొప్ప విషయం. శేష్‌తో చాలా కాలంగా ట్రావెల్‌ అవుతున్నాను. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ -” ట్రైలర్‌ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నా కెరీర్‌ క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు నాని గారు పిలిచి’ నేను లోకల్‌ ‘ సినిమాలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు. సినిమా కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చితుంది”అన్నారు.

ప్రముఖ నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ – ” ముందుగా ట్రైలర్‌ విడుదల చేసిన నాని గారికి థాంక్స్‌. నాని గారు, శేష్‌ వి సెల్ఫ్‌ మేడ్‌ అచీవ్‌మెంట్స్‌. ఫ్యాషన్‌, డెడికేషన్‌, హార్డ్‌ వర్క్‌ తో వారు ఈ స్థాయికి రాగలిగారు. సినిమా విషయానికి వస్తే ‘ఎవరు’ రెండు సంవత్సరాల క్రితం ఐడియా. ఈ సినిమాకు టీమ్‌ అందరూ చాలా కష్టపడి పని చేశారు. మంచి సినిమా తీశామని గర్వంగా ఉంది. ఆగష్టు 15న అందరూ సినిమా చూడండి’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.

న‌టీన‌టులు:
అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ: కాకా.

Evaru Trailer Launch – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here