సెప్టెంబర్ 6న రిలీజ్ కానున్న ఆది సాయికుమార్, శ్రద్ధ శ్రీనాథ్ ల ‘జోడి’….!!

0
603

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా, ఇటీవల తొలి సినిమా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘జోడి’. ‘ఏ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా’ అనే క్యాప్షన్ తో రాబోతున్న ఈ సినిమాకు గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 6న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ ఆసాంతం చాలా ఆహ్లాదంగా ఉన్నట్టుగా ప్రశంసలు వచ్చాయి.

ఆది సాయికుమార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంటూనే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఈ జోడి. ముఖ్యంగా ప్రధాన జోడి మధ్య ఉండే ప్రేమకథ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఆదిసాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. ఎంటర్టైనింగ్ గా సాగుతూ యూత్ ని అలరించే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తో పాటు, ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎమోషనల్ అంశాల మిళితంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంతోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here