యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న కొత్త సినిమా సాహో. బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ మరియు రెండు వీడియో సాంగ్స్ ప్రోమోలు ఇటీవల యూట్యూబ్ లో రిలీజయి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాయి.
ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సాహో యూనిట్ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేయడం జరిగింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో వెస్ట్రన్ అవుట్ ఫిట్ తో స్పెట్స్ పెట్టుకున్న నితిన్ ముకేశ్ డాషింగ్‌గా ఉన్నారు. ‘ది ఎండ్ డసన్ట్ ఆన్సర్ ఎవ్రిథింగ్’ అనే క్యాప్షన్ తో రిలీజైన ఈ పోస్టర్ సినిమా ఎంత స్టైలిష్ గా ఉండబోతోందో సూచిస్తోంది . ఓవర్ ఆల్ గా రోజురోజుకు విపరీతమైన అంచనాలు పెంచుతున్న ఈ సినిమా ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!


