స్పై థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ‘అశ్వమేథం` బిగ్ హిట్అవుతుంది – ద‌ర్శ‌కుడు నితిన్‌.జి

0
886

ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్ అండ్ సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్ పై ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్ లు నిర్మాతలు గా రూపోందిన‌ చిత్రం ‘అశ్వమేథం’. ధ్రువ కరుణాకర్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ నూతన దర్శకుడు నితిన్. జి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఆగస్టు విడుదలకు సిద్దమవుతున్న సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు నితిన్.జి ఇంట‌ర్వ్యూ..

మీ గురించి చెప్పండి ?
– నా పేరు నితిన్ జి. ‘అశ్వమేథం’ సినిమాకి దర్శకత్వం వహించాను. తెలుగులో నాకు ఇదే ఫస్ట్ ఫిల్మ్. అంతకు ముందు మరాఠీలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఒక సినిమా రిలిజ‌య్యి ద‌ర్శ‌కుడిగా నాకు మంచి పేరు, అలానే దాదా సాహెబ్ ఫాల్కె జ‌న్మ‌భూమి అవార్డ్ కూడా వ‌చ్చింది. రెండో సినిమా అక్టొబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. తెలుగులో నాకు ఇది మెద‌టి సినిమా కావ‌డంతో చాలా ఎగ్జ‌యిటింగ్ గా ఉంది.

మరాఠీ సినిమాల నుండి.. తెలుగు సినిమా వైపు ఎలా వచ్చారు ?
– మా నిర్మాత‌లు ప్రియా నాయ‌ర్‌,ఐశ్వ‌ర్య యాద‌వ్ వారి ద్వారానే నేను ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయడం జ‌రిగింది. నిజానికి నాకు తెలుగు మాట్లాడటం కూడా రాదు. అయినా వారిచ్చిన ప్రోత్సాహంతోనే తెలుగులో ఈ సినిమాకి డైరెక్షన్ చేశాను. ఈ సంద‌ర్భంగా నాకు హెల్ప్ చేసిన మా పిఆర్ టీమ్ వంశి-శేఖ‌ర్‌, మా లైన్ ప్రొడ్యూస‌ర్ ముర‌ళి గారికి థాంక్స్.

తెలుగు మాట్లాడటం రాదంటున్నారు క‌దా! భాష పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
– జాగ్రత్తలు అంటే.. ఏది డైరెక్ట్ చేయబోతున్నాం, సీన్ లో ఎమోషన్ ఏంటి, అసలు సీన్ ఏంటి అనే అంశాలను క్లారిటీగా అర్ధం చేసుకుంటే చాలు. భాష వచ్చినా చేసే పని అదే కదా. నాకు భాష రాకపోయినా.. నేను ఆ పని చేస్తాను. పైగా ప్రీ ప్రొడక్షన్ లో స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నప్పుడే తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అని చర్చించి స్క్రిప్ట్ చేసుకున్నాం.

‘అశ్వమేథం’ డైరెక్ట్ తెలుగు సినిమానా?
– డైరెక్ట్ తెలుగు సినిమానే. ఎలాంటి రీమేక్ కాదు. ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా తెలుగులోనే రాశాము. రచయిత జగదీష్ మెట్ల ఈ స్క్రిప్ట్ ను రాశారు. మా సినిమా లాస్ట్ ఇయ‌ర్ ఆగ‌స్ట్ లో స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ కార‌ణంగానే కొంత ఆల‌స్యం అయింది. ఇందులో ఆరు యాక్ష‌న్ ఎపిసోడ్స్, రెండు చేజింగ్ సీన్స్ ఉన్నాయి. మా హీరో ధృవ్ కరుణాకర్ డూప్ లేకుండా అన్ని ఎసిసోడ్స్ కంప్లీట్ చేశారు. ఆ స‌మ‌యంలోనే అత‌ను 14 సార్లు ఇంజ్యూర్ అవ్వ‌డం జ‌రిగింది. అందుకే ఆల‌స్యం అయింది.

ఈ సినిమా గురించి చెప్పండి ?
– ఇది ఒక డిజిట‌ల్ ఎక‌నామిక్ స్పై థ్రిల్లర్. కొంత మంది దురాశ‌ప‌రులు ఒక వ్య‌వ‌స్థ‌ని హ్యాక్ చేయాల‌నుకుంటారు..వాటిని హీరో ఎలా ఆ ప్రాబ్ల‌మ్ ని సాల్వ్ చేశాడ‌న్న‌దే క‌థాంశం. థ్రిల్లింగ్‌ గా సాగే ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.సినిమాని సపోర్ట్ చేస్తోనందుకు అందరికి చాలా థాంక్స్. అలానే ఈనెల 5,6 తారికుల‌లో ఈ సినిమాకు సంభందించిన అతి పెద్ద పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నాం. అది మాకు గిన్నిస్‌బుక్ రికార్డును తీసుకురానుంది.

టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
– ఈ సినిమాలో హీరో అశ్వ అనే కంపెనీతో క‌నెక్ట్ అయి ఉంటారు. అలాగే డిజిట‌ల్ ఎక‌నామిక్ ప్రాబ్ల‌మ్ ను సాల్వ్ చేస్తారు క‌నుక‌నే టైటిల్ `అశ్వమేథం` అని పెట్ట‌డం జ‌రిగింది.

మీ సినీ నేపథ్యం మరాఠీలోనే ఎక్కువుగా సాగింది. తెలుగు సినిమాలు చూస్తారా ?
– ఖచ్చితంగా. తెలుగు సినిమాలను నేను రెగ్యులర్ గా చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు నార్త్ లో కూడా బాగా చూస్తారు. అలాగే రవితేజ కూడా అక్కడి ప్రేక్షకులకు బాగా తెలుసు. బాహుబలి తరువాత తెలుగు సినిమా గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు.

ఈ సినిమా హీరో హీరోయిన్ల గురించి ?
– ఈ సినిమాలో హీరో ధృవ్ కరుణాకర్ ఉడిపి నుండి వ‌చ్చారు, శివంగి హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ధృవ్ కరుణాకర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతాడు. అతను మంచి టాలెంటెడ్ పర్సన్. హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వర్క్ ఎలా అనిపించింది ?
– ఈ సినిమాకి చరణ్ అర్జున్ మ్యూజిక్ మంచి అసెట్ అవుతుంది. తను రాసి చేసిన పాటలన్ని చాల బాగా వచ్చాయి. నెక్ట్ వీక్‌లో రాబోయే గ‌ణేశా సాంగ్ ఈ సినిమాకు హైలెట్. అందులో తెలుగు, మ‌హ‌రాష్ట్ర సంస్కృతిని మిక్స్ చేసి చూపించాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా మేకింగ్ పరంగా ఏమి కావాలన్నా అద్భుతంగా సపోర్ట్ చేశారు. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు ద‌ర్శ‌కుడు నితిన్‌.జి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here