‘గుణ 369’తో ఒక జెన్యూన్ సినిమా తీసారని రెండు ప్రొడక్షన్స్‌కి మంచి పేరొస్తుంది – హీరో కార్తికేయ

0
828

‘ఆర్‌ఎక్స్‌ 100’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత యూత్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు హీరో కార్తికేయ. కార్తికేయ హీరోగా శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌జీ మూవీ మేకర్స్‌ పతాకాలపై అర్జున్‌ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘గుణ 369’. అనఘ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్‌2నప్రపంచవ్యాప్తంగావిడుదలవనున్న సందర్భంగా హీరో కార్తికేయ ఇంటర్వ్యూ.

మీ మొదటి సినిమానే సూపర్‌ హిట్‌ అయ్యింది కదా? ఎలా అనిపిస్తుంది?
– అవునండీ! ‘ఆర్‌ఎక్స్‌100’ రిలీజ్‌ నుండి ఇప్పటి వరకూ ఎక్కడికి వెళ్ళినా ‘ఆర్‌ఎక్స్‌ 100 ‘ హీరో’ అనే పిలుస్తున్నారు. నా మొదటి సినిమానే ఇంత ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయడంఎంతో సంతోషంగా ఉంది. పైగా ఇప్పుడు హిందీ, కన్నడ, తమిళ్‌ భాషలలో ఆ సినిమాను రీమేక్‌ చేయటం మరింత హ్యాపీ. మన సినిమాను మిగతా భాషల్లో చేస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

ఈ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?
– అర్జున్‌ ఈ కథ నేరేట్‌ చేయక ముందు స్క్రిప్ట్‌ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఆయన చెప్పడం మొదలెట్టాక బాగా ఎగ్జయిట్‌ అయ్యాను. నేను అనుకున్న దానికంటే సినిమా ఇంకా బాగా వచ్చింది. ఆయనతో నాకు కంఫర్ట్‌ లెవెల్‌ బాగుంది. అందుకే ఆయనతో మళ్ళీ సినిమా చేయాలనుంది.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– సినిమాకు ‘గుణ 369’ టైటిల్‌ పెట్టడానికి స్ట్రాంగ్‌ రీజన్‌ ఉంది. సినిమాలో నేను నేను మంచి గుణాలున్న అబ్బాయిగా కనిపిస్తాను. అందుకే గుణవంతుడులో గుణ తీసుకున్నాం. ఆ టైటిల్‌ పవర్‌ కూడా హీరోలో ఉంటుంది. కథలో వచ్చే కీలక మార్పు వల్ల గుణ వంతుడిగా ఉండే నేను ఖైదీనంబర్‌ 369గా మారతాను. అందుకే ఈ టైటిల్‌ పెట్టడం జరిగింది. కథకి ఇదే యాప్ట్‌ టైటిల్‌.

దర్శకుడు అర్జున జంధ్యాలతో వర్క్‌ఎక్స్‌పీరియన్స్‌?
– అతని వేవ్‌లెంగ్త్‌, నా వేవ్‌లెంగ్త్‌ కలిశాయి. ఒక సందర్భానికి అతనెలా రియాక్ట్‌ అవుతాడో, నేనూ అంతే రియాక్ట్‌ అవుతాను. మన వేవ్‌లెంగ్త్‌కి కనెక్ట్‌ అయిన వాళ్లతో పనిచేస్తున్నప్పుడు ఓ మజా వస్తుంది. ఈ సినిమాలో నాకు అది అనిపించింది. పైగా అతనిలో జెన్యూనిటీ బాగా నచ్చింది. సినిమాలో ఏదో కమర్షియల్‌ వేల్యూస్‌ జోడించాలని అని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మంచిగా నటించాలి. 100 శాతం జెన్యూన్‌ గా చేయాలి అనే అనుకుంటా. అదే జెన్యూనిటీ అతనిలోనూ చూశాను.

హీరోయిన్‌గా అనఘనే తీసుకోవడానికి కారణం?
– సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ చాలా కీలకం. ఆ క్యారెక్టర్‌కి తెలిసిన వాళ్ళకంటే కొత్త అమ్మాయి అయితేనే క్లిక్‌ అవుతుందనుకున్నాం. అందుకే అనఘను హీరోయిన్‌ తీసుకోవడం జరిగింది. మీరు సినిమా చూసాక ఇదే ఫీల్‌ అవుతారు. సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా ఆ అమ్మాయికి పెర్ఫార్మర్‌గా మంచి పేరొస్తుంది.

ప్రొడ్యూసర్స్‌ గురించి?
– ఈ సినిమా చేస్తున్నప్పుడు, చేసాక నేను కూడా ప్రొడక్షన్‌లో పార్ట్‌ అయ్యుంటే బాగుండేది అనిపించింది. ఒక మంచి సినిమాకు మనం ప్రొడక్షన్‌లో కూడా పార్ట్‌ అయితే మనకి ఓ రెస్పెక్ట్‌ ఉంటుంది. మా నిర్మాతలకు ఆ అదృష్టం దక్కింది. ఇద్దరు మిత్రులు కలిసి మా సినిమా ప్రొడ్యూస్‌ చేయడం, వారు కూడా ఈ సినిమాతో సినిమా రంగంలోకి రావడం సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక ఒక మంచి సినిమా తీసారని రెండు ప్రొడక్షన్స్‌కి మంచి పేరొస్తుంది అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌ లో మీ రోల్‌ గురించి చెప్పండి?
– ”గ్యాంగ్‌ లీడర్‌’లో డిఫరెంట్‌ షేడ్స్‌ఉన్న నెగటివ్‌ క్యారెక్టర్‌ చేసాను. ఈ క్యారెక్టర్‌ చేయడానికి చాలా రీజన్స్‌ ఉన్నాయి. అందులో ఫిఫ్టీ పర్సెంట్‌ ఈ కథ నన్ను ఇన్స్‌పైర్‌ చేసింది. అయితే మిగతాది టీమ్‌. నాని-విక్రమ్‌కుమార్‌, మైత్రిమూవీ మేకర్స్‌ ఇలా పెద్ద వాళ్ళతో వర్క్‌ చేసే అవకాశం రావడం. సినిమా కోసం రేసింగ్‌ కూడా నేర్చుకున్నాను. నా క్యారెక్టర్‌ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. సినిమా రిలీజ్‌ తర్వాత కచ్చితంగా నటుడిగా నాకు మంచి పేరొస్తుంది అని మాత్రం గ్యారెంటీ గా చెప్పగలను.

కొత్త దర్శకులతో, ఎక్స్‌పీరియన్స్‌డ్‌ డైరెక్టర్స్‌తో ఒకే సారి పని చేయడం ఎలా అనిపిస్తోంది?
– కొత్త వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటాను. నా మనసులోని మాటలను యథేచ్ఛగా చెప్పేస్తుంటా. కానీ ఎక్స్‌పీరియన్స్‌డ్‌ వాళ్లతోనూ ఈ విషయాలను చెబుతాను. కానీ దానికంటూ స్పెషల్‌గా చెబుతా. పైగా నేను ఏదైనా సన్నివేశంలో బాగా చేసినప్పుడు వాళ్లు మెచ్చుకుంటే, ఆ హై నాలో ఇంకో విధంగా ఉంటుంది.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– శేఖర్‌ విక్యాత్‌ అనే నూతన డైరెక్టర్‌ తో సినిమా షూటింగ్‌ స్టేజిలో ఉంది. ఆ సినిమాను నా సొంత బ్యానర్‌ లోనే చేస్తున్నాను. ఈ ఏడాదిలోనే రిలీజ్‌ ఉంటుంది. ఈ మధ్యే ఇంకో కథ ఫైనల్‌ చేశాను. వినాయక్‌ గారి దగ్గర పని చేసిన శ్రీ అనే డెబ్యూ డైరెక్టర్‌ మంచి కథ చెప్పాడు. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్‌ మెంట్‌ ఉంటుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో కార్తికేయ.

Kartikeya – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here