టాలీవుడ్ లో వెరైటీ కథలతో సినిమాలు చేయడంలో ముందుండే నటుల్లో హీరో శర్వానంద్ కూడా ఒకరు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా రణరంగం. విభిన్న తరహా కథ, కథనాలతో సినిమాలు తెరకెక్కించే యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 90వ దశకం నాటి గ్యాంగ్ స్టర్ నేపధ్య కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని మాటల మాంత్రికుడు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులమీదుగా ఆగష్టు 4 న ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతానికి బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా కాకినాడ లో లేటెస్ట్ షెడ్యూల్ జరుపుకుంటూ ఉండడంతో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని అక్కడే ప్లాన్ చేసింది రణరంగం సినిమా యూనిట్. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ , కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది……!!


