సినిమాలో సిగరెట్ తాగినా తప్పేనా..రకుల్ ప్రీత్ సింగ్

0
461

సినిమాలో సిగరెట్‌ కాల్చినా కూడా తప్పేనా? అంటుంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఆమె హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం మన్మథుడు 2. చిలసౌ ఫేమ్ రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలైంది. అందులో రకుల్‌ సిగరెట్‌ తాగుతూ కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎందరికో రోల్‌మోడల్‌ అని, ఇలా సిగరెట్లు తాగితే వారూ పాడైపోతారని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రకుల్‌ స్పందించింది.

ఇటీవల ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..‘వాళ్ళ పనే అది కదా.. ఏదో ఒకటి అంటూ ఉంటారు. కబీర్‌ సింగ్‌ సినిమాలో షాహిద్‌ కపూర్‌ కూడా సిగరెట్‌ తాగారు. ఎందుకంటే ఆయన అలాంటి పాత్రలో నటించారు కాబట్టి. కానీ నిజ జీవితంలో ఆయన వెజిటేరియన్. కాబట్టి నిజ జీవితాన్ని సినీ జీవితంతో కలిపి చూడకూడదు. నేను సినిమాలో సిగరెట్లు కాల్చాను. ఎందుకు కాల్చాల్సి వచ్చిందో మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. నేను ట్రోల్స్‌ను పట్టించుకోను. ఇలాంటి వాటి కంటే జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి’ అని సమాధానమిచింది. రకుల్ సమాధానంపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here