ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్లో తెర‌కెక్కిన ‘మిస్ట‌ర్ కెకె’ నా కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అవుతుంది – చియాన్ విక్ర‌మ్

0
217

శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, సామి లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్‌ ఇమేజ్‌నిసోంతం చేసుకున్నారు చియాన్‌ విక్రమ్‌. లేటెస్ట్‌గా చియాన్‌ విక్రమ్‌ హీరోగా అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌ పై తమిళంలో రూపోందిన చిత్రం ‘కదరమ్‌ కొండన్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో టి. అంజయ్య సమర్పణలో ఉత్తమాభిరుచి గల నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు టి.నరేష్‌ కుమార్‌, టి. శ్రీధర్‌లు సంయుక్తంగా ‘మిస్టర్‌ కెకె’ టైటిల్‌తో జులై 19న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చియాన్‌ విక్రమ్‌ ఇంటర్వ్యూ…

మిస్టర్‌ కెకె సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి?
– ఇంటర్నేషనల్‌ స్టైల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్‌ కెకె’. నా సినిమా కెరీర్‌లో వన్‌ఆఫ్‌ది బెస్ట్‌ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. అది పాజిటివా? నెగటివా? అని ముందే పసిగట్టడం ప్రేక్షకుడికి వీలుకాదు. గ్రేషేడ్స్‌ ఉండే పాత్ర నాది. రేపు సినిమా చూసే సమయంలో ఆ విషయం మీకే అర్థమవుతుంది.

మీరు కథను బట్టి సినిమాలు ఎంచుకుంటారా! లేక క్యారెక్టరా?
– నా దృష్టిలో సినిమాకు కథే ముఖ్యం. కానీ అన్ని సమయాల్లో అది కుదరకపోవచ్చు. మంచి కథ ఉన్నప్పుడు గొప్ప క్యారెక్టర్‌ ఉండకపోచ్చు. కొన్ని సినిమాలకు క్యారెక్టర్‌ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే పాత్ర అంత బాగా ఉంటుందనే అర్ధం.

ఈ సినిమా గురించి చెప్పండి?
– నేను ఇంగ్లీష్‌ తరహా సినిమా చేసి చాలా కాలమైంది. ఈ సినిమాలో స్టైల్‌, ఫేజ్‌ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్‌ రియల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్‌ నుండి వచ్చిన టెక్నీషన్‌ గిల్‌ రియల్‌గా ఉండేలా ఫైట్స్‌ను తెరకెక్కించారు. ఒకరోజులో జరిగే కథ కాబట్టి.. సినిమా ఫాస్ట్‌ ఫేజ్‌లోరన్‌ అవుతుంటుంది. ఒక ఇంటర్నేషనల్‌ స్టైల్‌ మూవీని తెరకెక్కిస్తున్నానుకుంటే మన ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుందా? మన నెటివిటీని మిస్‌ అయ్యామా? అనే భావన కలగకుండా మన ఎమోషన్స్‌ ఉండే సినిమా.

మీ సినిమాలలో డైలాగ్స్‌ కి ఇంపార్టెన్స్‌ ఉంటుంది కదా?
– నార్మల్‌గా డైలాగ్స్‌ వల్లే మనం పెర్‌ఫార్మన్స్‌ చేయగలుగుతాం. అలాంటి డైలాగ్స్‌ లేకుండా నేను నటించానంటే.. ఏదో ఒక పార్ట్‌ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ చేస్తుందనే నమ్ముతాను. ఉదాహరణకు నేను శివపుత్రుడు సినిమా చేశాను. దాన్ని ఎవరూ రీమేక్‌ చేయలేదు. అంతకు ముందు ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. ‘శివపుత్రుడు’ని రీమేక్‌ చేయకపోవడానికి కారణం.. ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాదేమోనని అనుకున్నారు. కానీ అది నా పరంగా బాగా కనెక్ట్‌ అయ్యింది.

తమిళ, తెలుగు ప్రేక్షకులకి ఒకే సినిమా ఎందుకు కనెక్ట్‌ కాదు?
– నేటివిటీ కారణంగానే ఆడియెన్‌ సినిమాకు కనెక్ట్‌ కాడు. ఎమోషన్‌ మాత్రమే కనెక్ట్‌ అవుతుంది. ఉదాహరణకు గేమ్‌ ఆఫ్‌ థ్రోన్‌ సినిమా నేటివిటీ మనది కాదు. కానీ ప్రేక్షకులు సినిమాను చూశారు. అలాగే బాహుబలి సినిమా అందరికీ కనెక్ట్‌ అయ్యింది. అలా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే మంచి కథ

ఇండియన్‌ సినిమాలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తోంది?
– ప్రతి నటుడు డబ్బుకోసమో, ఏదో చేద్దాం లే! అనేలా కాకుండా హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తాడు. నా విషయానికి వస్తే నాకు హిట్‌ వచ్చిన ‘సేతు’ సినిమాకు ముందు 10-12 ఏళ్ల నుండి సినిమాలు చేస్తున్నాను. కానీ ప్రతి సినిమా చేసే సమయంలో ఇది నాకు కచ్చితంగా బ్రేక్‌ ఇస్తుందని అనుకునే చేశాను. నటుడిగా నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌నే ఎంచుకుంటాను. అందుకే ఇండియన్‌ సినిమాలో నాకంటూ ఒక గుర్తింపు ఉంది.

తెలుగులో స్ట్రైట్‌ సినిమా ఎప్పుడు చేస్తారు?
– ఇప్పుడు ప్యాన్‌ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. అలాగే నేను ఓ భాషలోనే సినిమాలు చేయాలనుకోలేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాకు మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమాలున్నాయి. తెలుగులో నాకు నచ్చే స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా సినిమా చేస్తాను.

దర్శకుడు రాజేష్‌ ఎం సెల్వ మేకింగ్‌ స్టైల్‌ గురించి?
– డైరెక్టర్‌ రాజేశ్‌ టెక్నికల్‌గా మంచి పరిజ్ఞానమున్న వ్యక్తి కావడంతో తనకేం కావాలో పూర్తి అవగాహన ఉంది. కాబట్టి కంఫర్ట్‌ జోన్‌లో సినిమాను చేసేశాను.

ఈ సినిమా ఫంక్షన్‌లో కమల్‌ హాసన్‌ మీ గురించి చాలా బాగా మాట్లాడారు కదా?
– సాధారణంగా కమల్‌సార్‌ ఎవరి గురించి పెద్దగా మాట్లాడరు. కానీ ఈ సినిమా ఆడియో టైమ్‌లో నా గురించి, నేను నటించిన తీరు ఆయన మాట్లాడిన తీరు చూసి కళ్లు చెమర్చాయి. కమల్‌ సార్‌ ఓ ఎరా.. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ను కమల్‌సార్‌ చేయాల్సింది. కానీ.. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయారు. నేను చేశాను. ఆయన సినిమా చూసి గుడ్‌ జాబ్‌ అని చెబితే చాలని అనుకుంటున్నాను.

ఈ లుక్‌ మీ నెక్స్ట్‌ మూవీ కోసమా?
– మణిరత్నంగారితో సినిమా చేయడాన్ని బాగా ఇష్టపడతాను. ఆయన మేకింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని ఆయన వివరించేటప్పుడు ఎలా వివరిస్తారా? అని ఆయన పక్కనే ఉండి అబ్జర్వ్‌ చేస్తుంటాను. ఆయన డైరెక్షన్‌లో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చేయబోతున్నాం. ఈ సినిమాలో నా పాత్రలో ఎమోషన్స్‌ ఎక్కువగా ఉంటాయి. రాజు పాత్రలో కనపడతాను. ఆ పాత్ర కోసమే జుట్టును కూడా పెంచుకుంటున్నాను. పొన్నియన్‌ సెల్వన్‌గా జయం రవి నటిస్తాడేమో ఇంకా తెలియదు. ఆ పాత్ర కనపడదు కానీ.. అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉండేలా సినిమా రన్‌ అవుతుంటుంది. అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటాయి.

మీ అబ్బాయి దృవ్‌ హీరోగా ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు కదా! మీకెలా అనిపిస్తోంది?
– దృవ్‌ అమెరికాలో మెథడ్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటున్నాడు. ఈ పాత్రకు తను మరి చిన్నోడు అవుతాడని తెలుసు. ఐదేళ్ల తర్వాత తనని యాక్టర్‌ చేయాలనుకున్నాను. కానీ నిర్మాత డబ్‌స్మాష్‌ వీడియో ఏదో చూసి తనతో సినిమా చేయాలంటూ వచ్చి కలిశాడు. నేను దృవ్‌కి ఫోన్‌ చేసినప్పుడు ఇప్పుడు నేను చేయాలంటారా నాన్నా? అడిగాను. చెయ్‌రా అని అంటే అలాగే అన్నాడు. తెలుగు సినిమా చూస్తావా? అంటే నువ్వు చెప్పావ్‌ కదా నాన్నా సినిమా చేస్తానని అన్నాడు. తను చాలా నేచురల్‌గా నటించాడు. కొన్ని సీన్స్‌లో నాకంటే బాగా నటించాడు. రొమాంటిక్‌ సీన్స్‌లో డిఫరెంట్‌గా నటించాడు. రొమాంటిక్‌ సీన్స్‌ చేసే సమయంలోనూ, డబ్బింగ్‌ చెప్పే సందర్భంలోనూ నాన్నా నువ్వు బయటకు వెళ్లు నాన్నా అన్నాడు. నేను లేను.. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉన్నాడనుకుని చెయ్యమని చెప్పాను.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీ చేస్తున్నాను. అది ఒక డిఫరెంట్‌ ప్యాట్రన్లో ఉండే స్పై థ్రిల్లర్‌. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లు. తరువాత మహావీర్‌ కర్ణ చాలా ప్రస్టేజియస్‌ ప్రాజెక్టు. త్వరలోనే అది స్టార్ట్‌ అవుతుంది. తరువాత అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాను… అంటూ ఇంటర్వ్యూ ముగించారు చియాన్‌ విక్రమ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here