నటుడు ప్రియదర్శి బుల్లెట్ బైక్‌ను ఎవరో దొంగలించారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్‌ను మూసుకు వేసుకొని వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆ టైంలో కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అది నిజమైన చోరీ కాదని.. సందీప్ కిషన్ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రమోషన్ కోసం చేసిన చర్య అని తరువాత తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శిని కూడా తీసుకోవాలని చిత్రబృందం భావించింది.
కానీ ప్రియదర్శి డేట్లు ఖాళీ లేక సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో కనీసం ప్రియదర్శి బైక్‌నైనా సినిమాలో చూపిద్దామని చిత్రబృందం భావించి బైక్‌ను చోరీ చేస్తున్నట్లుగా చిత్రించారు. ఈ విషయమై ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రియదర్శి కూడా కూడా కాస్త సీరియస్ అయ్యారు. విషయం మరింత సీరియస్ కాకముందే రంగంలోకి దిగిన సందీప్ కిషన్ అసలు విషయాన్ని బయటపెట్టారు. చోరీ అంశమై సందీప్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ విషయం మేం అనుకున్నదానికన్నా ఎక్కువ సీరియస్ అవుతోంది. ఇది ప్రచారం కోసం చేసిన చర్య. మాకు ప్రియదర్శి డేట్లు దొరకలేదు. దాంతో సినిమాలో ఆయన బైక్‌ను చూపించాలని తీసుకెళ్లాం. నాకు ఈ బైక్ నడపడం చాలా నచ్చింది. లవ్యూ దర్శి బాయ్’ అని బైక్ నడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ..‘నా బైక్‌కి నీ సినిమా ద్వారా బ్రేక్ ఇచ్చినందుకు థాంక్స్ అన్నా’ అని చెప్పారు.
Sorry this got more serious than we expected..it's a fun promotional campaign that we are doing for #NinuVeedaniNeedaniNene ..
As we dint get @priyadarshi_i dates..we had his bike make a special appearance in our film..
PS: I loved riding it ❤️
Love you Darshi boy 😘😘😘 pic.twitter.com/sx6DbUN4Sh— #NVNN 12th July (@sundeepkishan) July 8, 2019


