యూట్యూబ్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతున్న మన్మధుడు – 2 అవంతిక ప్రోమో టీజర్…..!!

0
89

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మన్మధుడు-2. కొన్నేళ్ల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ మన్మధుడుకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల వీక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి మార్కులు లభించాయి. ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటిస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ రూపొందిన టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.

రకుల్ ప్రీత్ రెండు వెరైటీ వేషియేషన్స్ లో కనిపించి అలరించిన ఈ టీజర్, ప్రస్తుతం దాదాపుగా 20 లక్షల వ్యూస్ తో అలానే 42 వేల లైకులతో యూట్యూబ్ లో టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. సమంత, కీర్తి సురేష్,  అక్షర గౌడ ప్రత్యేక అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సినీయర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిశోర్, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్, ఆనంది ఆర్ట్స్, వాయాకామ్ 18 పిక్చర్స్ బ్యానర్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు త్వరలో విడుదల కానున్నాయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here