సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సేవ దృక్పధాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన థింక్ పీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. తాజాగా ఈ సుప్రీం హీరో ఓ పాఠశాలను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. విరాళాలు ఇవ్వాలని తన అభిమానులను కూడా కోరారు.
తేజ్ ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..‘థింక్ పీస్ అనే ఆర్గనైజేషన్‌తో కలిసి నేను గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాను. తాజాగా మున్నిగూడలోని అక్షరాలయ స్కూల్‌ను దత్తత తీసుకున్నాను. మొత్తం 100 మంది పిల్లలకు రెండు సంవత్సరాల పాటు చదువు, ఆహరం నేనే అందిస్తాను. ఆ సంతోషకరమైన చిన్నారుల ముఖాలను చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాబట్టి, నా అభిమానులకు నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. మీకు తోచినంత విరాళంగా ఇవ్వండి. పిల్లలు, నేను, థింక్ పీస్ ఆర్గనైజేషన్ అంతా మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఈ ఏడాది మరో 50 మంది పిల్లలను నేను దత్తత తీసుకుంటాను’ అని పేర్కొన్నారు.
supreme hero sai dharam tej adopts a school


