బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమల ‘రాక్షసుడు’ మూవీ విడుదల తేదీ ఖరారు……!!

0
397

యంగ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందుతున్న కొత్త సినిమా రాక్షసుడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టింది. స్కూల్ కి వెళ్లే ఆడ పిల్లలను కిడ్నాప్ చేసి,  ఘోరంగా హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలు వంటి అంశాలతో ఈ టీజర్ కొనసాగింది. ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో సాగిన ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

ఇటీవల తమిళంలో రూపొందిన ‘రాచ్చసన్’ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. గతంలో రైడ్, వీర, ఒక ఊరిలో వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను హవీష్ ప్రొడక్షన్స్, ఏ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తుండగా, యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఆగష్టు 2వ తేదిన భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here