‘రాజ్ దూత్’ సినిమా సక్సెస్ అవ్వాలని కొరుకుంటూ విష్ చేసిన సాయి ధరమ్ తేజ్…..!!

0
774

దివంగత దిగ్గజ నటులు డాక్టర్ శ్రీహరి గారి తనయుడు మేఘంశ్ శ్రీహరి హీరోగా టాలీవుడ్ తెరకు పరిచయం అవుతున్న సినిమా ‘రాజ్ దూత్’. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రాజ్ దూత్ బైక్ మిస్ అవ్వడం, దానిని వెతికే బాధ్యత హీరోకు అప్పగించడం, ఆపై దానికోసం హీరో మరియు అతడి స్నేహితుడు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు అనే వినూత్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో మేఘంష్ సరసన కొత్త హీరోయిన్లు నక్షత్ర, ప్రియాంక వర్మ జోడి కడుతుండగా, యువ దర్శక ద్వయం అర్జున్, మరియు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబడుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, ఈ సినిమా టీమ్ ని విష్ చేస్తూ ఒక వీడియో బైట్ ని విడుదల చేసారు. అయన మాట్లాడుతూ, తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో శ్రీహరి గారు ఒకరని, తన తొలి సినిమా ‘పి’ల్ల నువ్వు లేని జీవితం’ లో శ్రీహరి గారు ఒక కీలక పాత్రలో నటించడం జరిగిందని, అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే శ్రీహరి గారు అకాల మరణం పొందడం తనకు ఎంతో బాధ కలిగించిందని తేజ్ అన్నారు. ప్రస్తుతం అయన తనయుడు మేఘంశ్ టాలీవుడ్ కి హీరోగా పరిచయం అవ్వడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి మేఘంష్, తండ్రి శ్రీహరి గారివలె టాలీవుడ్ లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుంటూ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక వీడియో ని పోస్ట్ చేసారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here