ఉదయ్, ఐశ్వర్యల ‘మిస్ మ్యాచ్’ టీజర్ లాంచ్ చేయనున్న విక్టరీ వెంకటేష్….!!

0
558

ఇటీవల టాలీవుడ్ లో విడుదలై మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంశలు పొందిన ‘ఆటగదరా శివా’ సినిమాలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ శంకర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా రూపొందుతున్న కొత్త సినిమా మిస్ మ్యాచ్. క్రీడా నేపథ్యంలో రొమాన్స్, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా మంచి కథాబలంతో ఆకట్టుకునే కథనంతో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందుతున్న తమ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని ఈ సినిమా దర్శకుడు ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సమయంలో చెప్పడం జరిగింది.

ఇక ఈ సినిమా టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన విక్టరీ వెంకటేష్, ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. సంజయ్‌స్వరూప్, ప్రదీప్‌రావత్, రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: గిఫ్టన్‌ ఇలియాస్, ఛాయాగ్రహణం: గణేష్‌చంద్ర, కథ: భూపతిరాజా, మాటలు: రాజేంద్రకుమార్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, నిర్మాతలు: జి.శ్రీరామ రాజు, భరత్‌రామ్.

ఇక ఈ సినిమా కోసం గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ తొలిప్రేమలోని ‘ఈ మనసే’ అనే పాటను నేటి తరానికి తగ్గట్లు రీమిక్స్ చేయడం జరిగిందని, తమ సినిమాకు ఈ పాట ప్రధానాకర్షణగా నిలుస్తుందని సినిమా యూనిట్ అంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here