రియల్ ఇన్సిడెంట్స్ తో కూడిన స్వచ్ఛమైన ప్రేమకథ గా ‘దొరసాని’ మంచి సక్సెస్ సాధిస్తుంది – హీరో ఆనంద్‌ దేవరకొండ

0
220

సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధురా ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొరసాని’. కె.వి.ఆర్‌ మహేంద్రను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌, ఆడియోకి ప్రేక్షకుల నుంచి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికేఆడియన్స్‌లో, ఇండస్ట్రీలో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయిన ఈ చిత్రం జూలై 12న గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్దమవుతున్న సందర్భంగా హీరో ఆనంద్‌ దేవరకొండఇంటర్వ్యూ..

‘దొరసాని’ గురించి చెప్పండి?
– ఇది ఒక పీరియాడిక్‌ లవ్‌ స్టోరీ, రాజు, దొరసాని అనే పాత్రల మధ్య జరిగిన స్వచ్ఛమైన ప్రేమకథ. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. కథలోని స్వచ్ఛత, నిజాయితీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. కథలోని ఫీల్‌ మిస్‌ అవకూడదని అన్నీ రియల్‌ లోకేషన్స్‌లో షూటింగ్‌ చేసి ఆ కథలోని ఆత్మను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసాం. కథను దర్శకుడు మహేంద్ర ట్రీట్‌ చేసిన విధానం చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.

హీరో అవుదామని ఇండియాకి వచ్చారా?
– అన్నయ్య (విజయ్‌ దేవరకొండ) ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత నాకు కొన్ని ఆఫర్స్‌ వచ్చాయి. కానీ అప్పుడు సీరియస్‌గా తీసుకొలేదు. ఇండియాకి అన్నయ్య బిజినెస్‌ని సపోర్ట్‌ చేద్దామని వచ్చాను. యుఎస్‌కి వెళ్ళకు ముందు థియేటర్స్‌ చేసాను. యాక్టింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంది కానీ.. సినిమా ఎక్స్‌పీరియన్స్‌ లేదు. ఆ టైంలో దర్శకుడు మహేంద్రను కలిశాక సినిమా మీద ఉన్న భయాలు పోయాయి. ఆయన అయిదు గంటలు కథ చెప్పాడు. ఆ కథను చెప్పిన తీరులోనే నాకు అర్థం అయ్యింది. ప్రతి పాత్ర రియల్‌గా ఉంటుంది. కరీంనగర్‌, వరంగల్‌, సిద్ధిపేటలో రియల్‌ కోదాడ దగ్గరలోని గడిలో ఎక్కువ రోజులు షూట్‌ చేసాం.

సినిమా చూసి విజయ్‌ ఏమన్నారు?
– సినిమా చూసే ముందు అన్న టెన్షన్‌ పడ్డాడు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా ఆనంద పడ్డాడు. సినిమా చూసిన తర్వాత నాకు అన్న ఇచ్చిన ఎనర్జీ కాన్ఫిడెన్స్‌ని పెంచింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే జూలై 12న మీ ముందుకు వస్తున్నాం.

మీరు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా ఎంటర్‌ అయ్యారు?
– విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ ఒకడు ఉన్నాడు అని సినిమా సర్కిల్‌లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్‌లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్‌ చేసాం. ఆ క్యారెక్టర్స్‌కి ఫిట్‌ అవుతాము అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మేము ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాం.

శివాత్మిక గురించి?
– ఈ కథలో రాజు, దేవకి పాత్రల మధ్య ఎక్కువ చనువు ఉండదు. అందుకే మాకు వర్క్‌ షాప్‌లు విడివిడిగా నిర్వహించారు. షూటింగ్‌ లోకేషన్‌లో కూడా పాత్రల మధ్య గ్యాప్‌ను మెయిన్‌ టైన్‌ చేసాము. మేము ఫ్రెండ్స్‌ అయితే ఆ ఫీల్‌ స్క్రీన్‌ మీదకు వస్తుందని ఆ జాగ్రత్త తీసుకున్నాము. ‘దొరసాని’ క్యారెక్టర్‌లో శివాత్మిక ఒదిగిపోయింది. తనకి ఇది మొదటి సినిమా అయినా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌, మెచ్యూర్డ్‌ ఆర్టిస్ట్‌లా పెర్‌ఫార్మ్‌ చేసింది. ఈ సినిమాతో నటిగా తనకి మంచి పేరు రావడం ఖాయం.

మీ అన్న మీకు ఎలాంటి సపోర్ట్‌నిచ్చారు?
– అన్న తన జర్నీలో చాలా స్టగుల్స్‌ చూసాడు. కానీ అన్నకు వచ్చిన సక్సెస్‌ నాకు ధైర్యాన్నిచ్చింది. టాలెంట్‌ ఉంటే సక్సెస్‌ అవ్వొచ్చు అనే నమ్మకం కలిగింది. కానీ నా ప్రతిభే నన్ను నిలబెడుతుందని నాకు తెలుసు. ఒక స్టార్‌గా కాకుండా ఒక బ్రదర్‌గా తన సపోర్ట్‌ నాకు ఎప్పుడూ ఉంటుంది. సినిమా రిలీజ్‌కి ముందే అన్నతో పోలుస్తున్నారు. ఆ పోలికలన్నీ ఈ సినిమా రిలీజ్‌ తర్వాత పోతాయి అని గట్టిగా నమ్ముతున్నాను.

మీ క్యారెక్టర్‌ గురించి చెప్పండి?
– ఇందులో నా పాత్ర పేరు రాజు. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. రాజు చాలా సహజంగా కనిపిస్తూ… నిజాయితీగా ‘దొరసాని’ని ప్రేమించిన రాజు లాగా కనపడతాడు. ఈ పాత్ర నేటి సమాజంలోని రియల్‌ లైఫ్‌ పాత్రలను ప్రతిబింబిస్తే చాలు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారని నమ్ముతాను.

ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో విజయ్‌ చాలా ఎమోషన్‌ అయ్యారు కదా?
– ఇంట్లో ఇద్దరం చాలా ప్రాక్టికల్‌గా ఉంటాము. ఎమోషనల్‌ టాక్స్‌ తక్కువ. కానీ అన్న నా గురించి మాట్లాడుతుంటే నేను కూడా ఎమోషనల్‌ అయ్యాను. ఎందుకంటే తమ్ముడ్ని చూసుకోవాలని ప్రతి అన్నకు ఉంటుంది. కానీ నా కష్టం నేను పడాలి, నా కథ నేను వెతుక్కోవాలి.. అని అన్న అనుకున్నాడు. స్టేజ్‌ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్నలాగే ఫీల్‌ అయ్యాను. అన్నది పదేళ్ళ ప్రయాణం. అందులో చాలా చూసాడు. అన్నతో పాటు ఒకసారి ఆడిషన్స్‌కి వెళ్ళాను. సెలెక్ట్‌ అవలేదు. ఆ రోజు అన్న ఎంత బాధ పడ్డాడో నేను దగ్గర నుండి చూసాను. నాన్న సీరియల్స్‌ డైరెక్ట్‌ చేసేవారు కాబట్టి మా ఇంట్లో రోజూ సినిమాల గురించి డిస్కషన్స్‌ ఉండేవి.

దర్శకుడు మహేంద్ర గురించి?
– దర్శకుడు మహేంద్ర గ్రేట్‌ స్టోరీ టెల్లర్‌. మా కథలోని అన్ని క్యారెక్టర్స్‌ మీద అతనికి పూర్తి క్లారిటీ ఉంది. ఇందులో మా ప్రేమకథ స్వచ్ఛంగా ఉండి, చాలా టర్న్స్‌ ఉంటాయి. మా ప్రేమకథలో మా ప్రేమను థియేటర్‌లో ఆడియన్స్‌ ఫీల్‌ అవుతారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటారు.

నిర్మాతల గురించి?
– ఒకసారి కథను ఒకే చేసాక నిర్మాతలు మాకు పూర్తి ఫ్రీడమ్‌ ఇచ్చారు. అంతా కొత్త వాళ్లమే అయినా మాపై పూర్తి నమ్మకం ఉంచారు. వారంతా నిజాయితీగా ఉండి మా బాధ్యతను మరింత పెంచారు. కథకి ఏది అవసరమో అది సమకూర్చారు. సినిమా ఇంత బాగా వచ్చిందంటే మెయిన్‌ రీజన్‌ వారే.

తదుపరి చిత్రాల గురించి?
– ఈ సినిమా తర్వాత ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే స్టోరి విన్నాను. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. వినోద్ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఆ చిత్రం వివరాలు తెలియజేస్తా.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here