రెట్టింపు ధరకు ఇల్లు కొనలేదంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా!

0
459

మిల్కీ బ్యూటీ తమన్నా ముంబయిలోని వర్సోవా ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్‌ను రెట్టింపు ధరకు కొన్నట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బీచ్ వ్యూ కనిపించేలా.. అందమైన ఇంటిని రూ.16 కోట్లకు ఆమె కొన్నట్లు వార్తలు వెలుబడ్డాయి. వర్సోవాలో ఉన్న ధర కంటే.. రెట్టింపు మొత్తం ఇచ్చి తనకు ఇష్టమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వార్తలు రాసుకొచ్చాయి. అయితే దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదన్నారు.

ఇల్లు కొన్నావా? అని తన హిందీ టీచర్‌ మెసేజ్‌ చేస్తే..‘రెట్టింపు ధరకు నేనేందుకు కొంటానని మా టీచర్‌కు చెప్పా’ అని తమన్నా చెప్పారు. దీంతో ఆ టీచర్‌ తమన్నా తరఫున ట్వీట్‌ చేశారు. అయినా సరే అభిమానులు నమ్మలేదు. తమన్నాను దీని గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో ఈ అంశమై తమన్నా మళ్ళీ ఒక్కసారి స్పందించారు. ‘చాలా రోజులు అయినప్పటికీ ప్రజలు ఇదే ప్రశ్న అడుగుతుంటే నాకు విసుగొస్తోంది. నేను ఇల్లు కొన్నా, కానీ రెట్టింపు ధరకు కాదు. నేను ఒక సింధీ అమ్మాయిని.. నేను రెట్టింపు ధరకు కొన్నానంటే ఎలా నమ్ముతున్నారు. ఇంటి పనులు పూర్తయ్యాక మా తల్లిదండ్రులతో కలిసి అక్కడికి షిఫ్ట్‌ అవుతా. నాకు సింపుల్‌గా జీవించడమే ఇష్టం’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. ఇక తమన్నా సినిమా విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి, దటీజ్ మహాలక్ష్మి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే తమిళ్లో ఆనందో బ్రహ్మ రీమేక్ లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here