బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా మిషన్ మంగళ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అంగారక గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన మంగళ్ యాన్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటి ప్రయోగంలోనే ఇండియా అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపించి అగ్రదేశాల సరసన నిలిచింది.
ఈ మంగళ్ యాన్ మిషన్ లో కీలక పాత్ర పోషించిన ఐదుగురు మహిళా శాస్త్రవేత్తల ఆధారంగానే మిషన్ మంగళ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మహిళా శాస్త్రవేత్తలే హీరోలు. ఆ ఐదుగురి పాత్రల్లో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి, నిత్యామీనన్, కృతీ కులకర్ణి నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో శర్మాన్ జోషి నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జగన్ శక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సెలెబ్రిటీలు సైతం టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్నారు.


