రేపు గుంటూరులో ‘ఇస్మార్ట్ శంకర్’ టీమ్ స్పెషల్ ఈవెంట్….!!

0
86

రామ్, పూరి జగన్నాథ్ ల కలయికలో రాబోతున్న లేటెస్ట్ మాస్ కమర్షియల్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఇక ఇటీవలే యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ ప్రస్తుతం అత్యధిక వ్యూస్ సాధిస్తూ, వీక్షకుల అభిమానంతో దూసుకుపోతున్నాయి. రామ్ సరసన నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి సక్సెస్ సాధించడంతో, తమ సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి, రేపు ఆంధ్రప్రదేశ్ లో మిర్చికి పెట్టింది పేరైన గుంటూరులో ‘ఇస్మార్ట్ ఈవెంట్’ పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించనుంది ఇస్మార్ట్ శంకర్ మూవీ టీమ్.

గుంటూరు జిల్లా అమరావతిలోని వివిఐటి కాలేజీలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య ఈ ఈవెంట్ ని ఆ కాలేజీ స్టూడెంట్స్ మధ్య ఎంతో వేడుకగా నిర్వహించనున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ విడుదల తరువాత అంచనాలు మరింత పెరిగిన తమ సినిమా, రేపు విడుదల తరువాత ఆ అంచనాలను తప్పకుండ అందుకుని తీరుతుందని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపోతే స్వర బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసి సినిమాను ఈనెల 18న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here