వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ వర్కవుట్స్ ఫోటో…!!

0
413

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఒక కీలక యాక్షన్ సీన్ కోసం ఎన్టీఆర్ తన జిమ్ లో ఎంతో కష్టపడి వర్కవుట్స్ చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ వర్కవుట్స్ చేస్తున్న ఫోటోని ఆయన ఫిజికల్ ట్రైనర్, స్టీవెన్ లాయిడ్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయడం జరిగింది. భారీ తారాగణంతో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారని, దాని కోసమే ఎన్టీఆర్ ఈ విధంగా తన శరీరాన్ని మరింతగా దృఢపరుస్తున్నారని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here