రాజకుమారుడు చిత్రం ద్వారా టాలీవుడ్ కి తండ్రి కృష్ణ గారి నటవారసత్వంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తోలి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు పలు సూపర్ డూపర్ హిట్స్ లో నటించి, తండ్రికి తగ్గ తనయుడిగా, ప్రస్తుత టాలీవుడ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న మహేష్ బాబు, జీవితంలో ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ఇక తనతో కలిసి పనిచేసేవారిని కూడా గుర్తించి, వారి వారి పుట్టినరోజు తేదీలు తెలుసుకుని మరీ వారిని విష్ చేస్తుంటారు.
ఆ విధంగా తండ్రి కృష్ణ గారివలె మంచి మనసున్న మహేష్ బాబు, నేడు తన పర్సనల్ మేకప్ మ్యాన్ గా పని చేస్తున్న పట్టాభి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పట్టాభి గారు, మీ పై ప్రేమ, అభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ అయన తన పోస్ట్ లో తెల్పడం జరిగింది.


