స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఇటీవలే విడుదలై చిత్ర ట్రైలర్ఆడియో మిలియన్స్ వ్యూస్ అధిగమించి సినిమా మీద అంచనాలను పెంచాయి. రియల్ స్పార్క్ తో కూడిన మేఘాంశ్ హీరోయిక్ లుక్ అందరినీ అబ్బురపరుస్తోంది. జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవనున్న సందర్భంగా హీరో మేఘాంశ్ ఇంటర్వ్యూ .
రాజ్‌దూత్ గురించి చెప్పండి?
– చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. మామూలు ఎండల్లో చేయలేదు. 45,46 డిగ్రీల్లో చేశాం. అందరం చాలా కష్టపడి చేశాం. నిర్మాత కూడా చాలా కష్టపడ్డారు. అందరి కష్టం ఫలిస్తుందని నమ్ముతున్నా.
చిన్నప్పటి నుంచీ సినిమాల్లోకి రావాలని ఉండేదా?
– అవునండీ. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాల్లోకి రావాలనే ఉండేది. నాన్న కూడా పెద్దోడిని డైరక్టర్‌ని, చిన్నోడిని హీరోని చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. సో ఆయన చెప్పిన మాట కూడా ఫాలో కావాలని చేశాం.
ఈ టైటిల్ నే ఫిక్స్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందా?
– టైటిల్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మొదటి నుంచీ రాజ్‌దూత్ అనే అనుకున్నాం. ఈ సినిమాకు ఆ టైటిల్ తప్పితే ఇంకేమీ పనికిరాదు. అంత బాగా సెట్ అయిన టైటిల్ అది. అందుకనే అదే టైటిల్ ఫిక్స్ చేశాం.
టైటిల్ రాజ్ దూత్ అని పెట్టి మీరు రాయల్ ఎంఫిల్డ్ మీద ఉన్నారు?
అదే ఈ సినిమాలో ట్విస్ట్ అండి. నేను ఆరేళ్ళ క్రితం తప్పిపోయిన ఒక రాజ్ దూత్ బండి కోసం వెతుకుతూ కనిపిస్తాను. ఆ బండిలో ఉన్న వజ్రాల కోసం నాతో పాటు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ వెతుకుతుంటాయి. ఆ సందర్భం లోనే బోలెడంత ఫన్, ఎమోషన్ కూడా జనరేట్ అవుతుంది.
సినిమా ఏ జోనర్ లో ఉంటుంది?
– నిజానికి సినిమా ఒక పర్టిక్యులర్ జోనర్‌లో ఉంది అని చెప్పలేం. అలాగని థ్రిల్లర్ అని కూడా చెప్పలేం రెండు, మూడు జోనర్ల మిక్సింగ్‌గా ఈ సినిమా ఉంటుంది. ఇది కమర్షియల్ గా ఉంటూనే అందరిని థ్రిల్ చేస్తుంది.
ఇప్పుడేం చదువుతున్నారు?
– బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాను.
ఈ కథే ఎందుకు నచ్చింది?
– నా ఏజ్‌కి, నా ఫేస్‌కి ఈ కథ కరెక్ట్ అనిపించింది. సినిమా ఎక్కడా ఎక్కువ ఉండదు. ఎక్కడా తక్కువ ఉండ కుండా ఒక మీడియం ప్యాట్రన్ లో వెళుతుంది. అలాగని కమర్షియల్ అంశాలు ఉంటాయి.
మమ్మీ సినిమా చూసి ఏమన్నారు?
– సినిమా చూసి చాలా ప్రౌడ్‌గా ఫీలయింది. నెర్వస్‌గానూ ఉండేది. కానీ సినిమా చూశాక కాస్త తగ్గింది. సినిమా చూసి నువ్వు ఇంత రంగున్నావేంట్రా అని చెప్పింది. బాగా చేశానని చెప్పింది.
మీకు డాన్సింగ్ గురువు మీ మమ్మీ గారేనా?
– ఇంట్లో మేం డ్యాన్సు చేసేటప్పుడు మా అమ్మ గైడ్ చేసేది. మా ఇంట్లో అంత పెద్ద డ్యాన్సర్ ఉన్నప్పుడు ఆమె
తప్పకుండా ఆమె దగ్గరే నేర్చుకున్నా.ఇక ఈ సినిమాలో డాన్స్ లు బాగా చేశాననే అనుకుంటున్నాను.
డాడీ ఉన్నప్పుడు ఏం చెప్పేవారు?
– మనం ప్రతి ఒక్కరిని బాగా ట్రీట్ చేయాలి, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. అందరితోనూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వీలైనంత ఎక్కువ మందికి సాయం చేయాలి అని చెప్పేవారు.
చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు ఎలా అనిపించింది?
– అప్పుడు నాన్నగారు పక్కనే ఉండే కదా సో అంతా స్మూత్‌గా అనిపించింది. ఏ ప్రాబ్లమ్ వొచ్చిన ఆయనే చూసుకునే వారు, యాక్టింగ్లో కూడా గైడెన్స్ ఇచ్చేవారు.
మీనాన్నగారి నుంచి మీకు వచ్చిన లక్షణం ఏంటి?
– ఏమోనండీ నాకూ తెలియదు సినిమా చూసి మీరే చెప్పాలి. కాకపోతే ఈ నవ్వు మాత్రం మా నాన్నగారి నుంచే వచ్చిందనిపిస్తోంది. నాన్న ఎమోషన్,కోపం లాంటివి పర్ఫెక్ట్ గా చేసేవారు.
యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారా?
– ఈ సినిమా మొదలు కావడానికి ముందు వారం రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. కాకపోతే నా చిన్నతనం నుంచీ నేను థియేటర్స్ లో బాగా చేసేవాడిని. అది ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. తేజగారు అని ‘బాహుబలి’ సినిమాలో ట్రాన్స్ లేటర్‌గా చేశారు. ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నా.
మీ అమ్మగారు, అన్నయ్య ఇచ్చే సలహాలు పాటిస్తారా?
– అమ్మా, అన్నయ్యా ఇద్దరూ ఎప్పుడూ నా ప్లస్ పాయింట్లు. వాళ్ల సలహాలు ఎప్పుడూ విలువైనవే. తప్పకుండా పాటిస్తాను.
ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏమైనా నెర్వస్ ఫీలయ్యారా?
– మొదటి కొన్నాళ్లు అనిపించింది. కానీ పోను పోనూ అలవాటైంది.
మీరు కొంత కాలం ఇండస్ట్రీ నుండి దూరంగా ఉన్నారు?
– మేం నిజానికి దూరంగా ఉన్నట్టు అనిపించినా ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఎప్పుడూ అందరూ ఫోన్లు చేసి మాట్లాడిస్తూనే ఉండేవారు. ఇప్పుడు మనోజ్ అన్న కూడా మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి మాకు మంచి ప్రేమ అందుతోంది. అలాగే మీడియా కూడా ఈ సినిమాకు మంచి సపోర్ట్ చేసింది.
మీ నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చినవి?
– భద్రాచలం, డీ, కింగ్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర .. ఇలా చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి.
మిమ్మల్ని మీరు ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద చూసినట్టు ఎలా అనిపించింది?
– డబ్బింగ్ చెప్పినప్పుడే చూశా. క్రౌడ్ మధ్యలో కూర్చుని వారితో పాటు ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలని ఉంది.
ఇంకా ఈ సినిమాలో హైలైట్స్?
– మేం స్క్రీన్ మీద చేసిన అల్లరి, పాటలు, సిట్చువేషన్స్… అన్నీ హైలైట్స్ ఈ సినిమాలో నేను హీరో గా లాంచ్ అవడానికి ఇదే పర్ఫెక్ట్ సబ్జెక్టు అనుకుంటున్నా.
.