‘లయన్ కింగ్’ లో సింబా కు డబ్బింగ్ చెప్పిన నాని తెలుగు ప్రోమో

0
81

టాలీవుడ్ హీరోల్లో నాచురల్ స్టార్ గా మంచి పేరు సంపాదించిన నటుడు నాని. ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గ్యాంగ్ లీడర్, వి అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే మరోవైపు ఆయన ‘ది లయన్ కింగ్’ అనే హాలీవుడ్ చిత్రానికి తన గాత్రాన్ని అందిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేషన్‌ డిస్నీ కామిక్ గా వచ్చి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన లయన్ కింగ్, ప్రస్తుతం త్రీడి చిత్రం రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక తెలుగులో ప్రస్తుతం డబ్బింగ్ కాబడుతున్న ఈ చిత్రంలో ‘సింబా’ అనే పాత్రకు నాని తెలుగు డబ్బింగ్ చెప్తున్నారు.

జంతుజాతిని ఎన్నో ఏళ్ళు రారాజుగా ఏలిన ముఫాసా, కొడుకైన సింబాకు తన తదనంతరం రాజుగా పట్టం కడతాడు. అయితే సింబా రాజైన తరువాత అతడికి ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది సినిమాలో చూపించడం జరిగింది. ఇక సింబా పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన నాని, కాసేపటి క్రితం సింబా పాత్ర తాలూకు వీడియో ప్రోమోను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే చిత్రంలోని సింబా తండ్రి ముఫాసా పాత్రకు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తన గాత్రాన్ని అందించనున్నారు, అలానే ఇందులోని పలు ఇతర పాత్రలకు ప్రముఖ నటులు జగపతి బాబు, హాస్యనటులు బ్రహ్మానందం, ఆలీ తదితరులు తమ గాత్రాన్ని అందించడం జరిగింది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబడుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా జులై 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here