‘బి ఇస్మార్ట్’ మెన్స్ క్లాతింగ్ వెబ్ సైట్ లాంచ్ చేయనున్న ఇస్మార్ట్ శంకర్ యూనిట్…..!!

0
201

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు వీక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, రామ్ పలికిన పూరి మార్కు డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఇంటరెస్టింగ్ గా సాగింది. ఇక ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుకను నిన్న సాయంత్రం వరంగల్ జిల్లా హన్మకొండలో యూనిట్ సభ్యులు మరియు అభిమానులు సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత తమ చిత్రం పై అంచనాలు విపరీతంగా పెరిగాయని, రేపు విడుదల తరువాత తమ చిత్రం తప్పకుండా ఆ అంచనాలను అందుకుంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది .ఈ చిత్రంలో హీరో రామ్ ధరించిన దుస్తులను ‘బి ఇస్మార్ట్’ పేరుతో ఒక మెన్స్ క్లాతింగ్ ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయించనున్నారు. ఈ రకమైన వినూత్న ప్రచారం కూడా ఇస్మార్ట్ శంకర్ కు ఎంతో దోహదపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here