ఆకట్టుకుంటున్న సాహో పార్టీ సాంగ్ “సైకో సయ్యా” సాంగ్…!!

0
142

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం సాహో. యువి క్రియేషన్స్ సంస్థపై నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. ఇకపోతే నేడు ఈ చిత్రంలోని పార్టీ యాంతమ్ సాంగైన ‘సైకో సయ్యా’ అనే పల్లవితో సాగె సాంగ్ ను కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సాంగ్ లో ఆకట్టుకునే మోడరన్ స్టైల్ అవుట్ ఫిట్స్ లో ప్రభాస్ మరియు శ్రద్ధ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక వారు చేసిన డాన్స్ మూమెంట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ వీడియో ప్రస్తుతం విడుదలైన అన్నిభాషల్లోనూ అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. తనిష్క్ బాగ్చి మ్యూజిక్ అందించిన పాటని ధ్వని భానుశాలి సచేత టాండన్ హుషారుగా పాడారు, రాజు సుందరం, వైభవి మర్చంట్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఈ పార్టీ సాంగ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here