3 రోజుల్లో రూ.17 కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతున్న “ఓ బేబీ”

0
96

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ఓబేబీ. ఇక మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో ఆద్యంతం వినోదాత్మముగా సాగే ఈ చిత్రం పై కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక, సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు.

చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సమంత, మరియు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన సీనియర్ నటి లక్ష్మి, నటుడు రాజేంద్ర ప్రసాద్ ల నటన పై కూడా అభినందనలు వెల్లివిరుస్తున్నాయి. ఈ సినిమా విడుదలై నేటికి మూడు రోజులు గడవడంతో, తమ చిత్రం ఈ మూడురోజుల్లో రూ.17 కోట్ల మేర వసూళ్లు అందుకుందంటూ చిత్ర బృందం కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుండి మంచి స్పందనను రాబట్టిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ముందుకు సాగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here