కబీర్ సింగ్ పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…!!

0
435

2017లో టాలీవుడ్ లో విడుదలై మంచి సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఇటీవల బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రేమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం అక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం అత్యద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే రూ.200 కోట్లు దాటి, రూ.250 కోట్ల వసూళ్లకు చేరువవుతున్న ఈ సినిమా విజయం పై ప్రేక్షకులు మాత్రమే కాక కొందరు సినీ ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు.

నిన్న సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై ప్రశంశల జల్లు కురిపించారు. కబీర్ సింగ్ సినిమాని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని, సినిమాలోని పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అయన మలచిన తీరు చాలా బాగుందని, సినిమాలో హీరో, హీరోయిన్లు సహా అందరూ ఎంతో బాగా నటించారని వర్మ ఒక పోస్ట్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. అంతేకాక ఆ సినిమా విజయానందాన్ని దర్శకుడు సందీప్ రెడ్డితో కలిసి పంచుకుంటూ అయన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here