తమ్ముడిని తలచుకొని ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ

0
90

విజయ్ దేవరకొండ తన అభిమానులకు రౌడీ. ఏ కార్యక్రమానికి వెళ్లినా తన ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతూ.. సూటిగా.. సుత్తిలేకుండా ప్రసంగిస్తారు. అయితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ రౌడీ ఎమోషనల్ అయ్యారు. తమ్ముడిని తలచుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనంద్ దేవకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన దొరసాని జూలై 12న విడుదల కానుండటంతో ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు జీవిత, రాజశేఖర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తమ్ముడు గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు విజయ్.

విజయ్ మాట్లాడుతూ..దొరసాని సినిమా పూజా కార్యక్రమాలకు రావాలని ఉన్నా ఆపుకున్నా.. టీజర్ సోషల్ మీడియాలో షేర్ చేయాలని అనుకున్నా కాని ఆపుకున్నా.. ఈ సినిమాలోని చాలా పాటలు నాకు నచ్చాయి. షేర్ చేద్దాం అనుకున్నా కాని ఆపుకున్నా.. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో.. తనను తాను ఎలా నిరూపించుకోవాలో తెలుసుకుంటాడని ఈ సినిమాను ఇప్పటి వరకూ పట్టించుకోలేదు.. అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు విజయ్ దేవరకొండ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here