దర్శక ధీరులు ఎస్ ఎస్ రాజమౌళి అత్యున్నత స్థాయిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇక స్వాతంత్రోద్యమ నేపథ్య కథ, కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుంటే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
ఇక నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ పై కొందరు ఫ్యాన్స్ ఒక ఫోటోను డిజైన్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ లుక్ పై కాసేపటిక్రితం ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ, నిజంగా ఈ కొమరం భీం లుక్ బాగుందని, దానిని డిజైన్ చేసిన ఏజే ఆర్ట్స్ వారికి కృతజ్ఞతలు తెల్పుతూ ట్వీట్ చేయడం జరిగింది.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది …!!