ఈ నెల 19న భారీ స్థాయిలో విడుదల కానున్న చియాన్ విక్రమ్ “మిస్టర్ కేకే”…!!

0
144

ప్రముఖ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా ఆయన కెరీర్ పరంగా 56వ చిత్రంగా రూపొందుతున్న కొత్త చిత్రం మిస్టర్ కేకే. రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘కదరమ్‌ కొండన్‌’ పేరుతో తమిళంలో ఎంతో భారీ ఎత్తున దీనిని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో టి.నరేష్‌ కుమార్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా ‘మిస్టర్‌ కేకే’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇటీవల విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన కిల్లర్ చిత్రాన్ని విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సంస్థ ద్వారా వస్తున్న తదుపరి చిత్రం కావడంతో టాలీవుడ్ లో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

గతంలో చీకటి రాజ్యం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్ తనయ అక్షర హాసన్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజ‌ర్ త‌న‌యుడు అబీ హ‌స్స‌న్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇక చిత్రాన్ని ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మతలు కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. యువ సంగీత దర్శకుడు జీబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ని ఆర్ గుతా, ఎడిటింగ్ కే ఎల్ ప్రవీణ్, ఆర్ట్ ప్రేమ్ నవాస్ అందిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here