‘ఆకాశంలో ఒక తార’ హార్ట్ టచింగ్ ఫిల్మ్. సినిమా చూసి చాలా ఉద్వేగానికి గురయ్యాను: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి

0
3

‘ఆకాశంలో ఒక తార’ హార్ట్ టచింగ్ ఫిల్మ్. సినిమా చూసి చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి మంచి సినిమాకు గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక కల కనడం ఒక ఎత్తు, ఆ కలను సాకారం చేసుకోవడం మరో ఎత్తు, సాకారం చేసుకున్న ఆ కల ఇంత మంచి సక్సెస్ తీసుకురావడం ఇంకో ఎత్తు. ఈ మూడు ఈరోజు జరిగాయి. అందుకే చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో ముందుగా ఆడియన్స్‌కు థాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి సినిమాకు ఇంత గొప్ప ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ. ఈ కలను సందీప్, రమ్య, పవన్, రాజు బావ భుజాన మోశారు. ఒక కలను అన్నేళ్లు మోయడం అంత తేలిక కాదు. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నాను. సినిమా పరంగా స్వప్న, నా ఏజ్ ఒకటే. ఎందుకంటే స్వప్న బ్యానర్‌లోనే ‘స్టూడెంట్ నంబర్ వన్’ సినిమాతో నేను దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఆకాశంలో ఒక తార ఇంత అద్భుతంగా రావడానికి స్వప్నే కారణం. తనే ఈ స్థాయిలో రూపొందించింది. అరవింద్ గారు అవార్డు విన్నింగ్ సినిమాలు చేస్తున్నారు. కాకపోతే నాకు ఒక కోరిక ఉంది. ఇలా కలిసి చేస్తున్నప్పుడు ఈ యంగ్ ప్రొడ్యూసర్స్ అందరూ క్రెడిట్ మొత్తం తీసుకుంటారు. ఆయన ‘మగధీర’ చేసినట్టు సోలో ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేయాలి. లేదంటే క్రెడిట్ అంతా వాళ్లే తీసుకెళ్లిపోతారు (నవ్వుతూ). ఇది హార్ట్ టచింగ్ సినిమా. ‘ఆకాశంలో ఒక తార’ కథ హార్ట్ టచింగ్‌గా ఉండటానికి స్క్రీన్‌ప్లే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా బిగినింగ్, ఎండింగ్‌లో ఉండే పాయింట్స్‌ను బ్లెండ్ చేస్తూ ఒక అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు. చివర్లో కల్పన, నాజర్ పాత్రల మధ్య ఉండే సన్నివేశం చూసినప్పుడు నిజంగా చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి సీన్లు, డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. ‘నీ కల ఆకాశంలో ఉంటే భూమితో నాకేం అవసరం’ అనే మాట కూడా కచ్చితంగా గంగరాజు గారే రాసి ఉంటారు. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. మీరు ఇంకా సినిమా చూడకపోయి ఉంటే కచ్చితంగా ఈ వీకెండ్ వెళ్లి సినిమా చూడండి. ఇందులో చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు. రుహాని చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే దుల్కర్ సిస్టర్‌గా చేసిన శ్వాసిక క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. శ్రుతి తన పాత్రను ఎంతో సహజంగా చేసింది. ఆ పాత్రలో ఇమిడిపోయింది. తెలుగులో ఎవరినైనా సరే ఆదరిస్తారు. కాకపోతే ఒక తెలుగు అమ్మాయి జయప్రద గారు, శ్రీదేవి గారిలా గొప్ప స్టార్ అయితే బాగుంటుందని మనసులో ఉంటుంది. ఆ లోటును సాత్విక భర్తీ చేస్తుంది. తప్పకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తుంది. ‘ఆకాశంలో ఒక తార’ దుల్కర్ భుజాల మీద నిలబడింది. అందులో సందేహం లేదు. దుల్కర్ లేకపోతే ఇలాంటి అందమైన సినిమాను చూసేవాళ్లం కాదు. ఈ విషయంలో దుల్కర్‌కు థాంక్యూ. దుల్కర్ విషయంలో ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుంది. దుల్కర్ మనోడే. పవన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో నాకు తెలుసు. ఒక దర్శకుడిగా నేను అర్థం చేసుకోగలను. కచ్చితంగా పవన్‌కు చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది. అలా మనసుల్ని కదిలించే సినిమాలు తను తీయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్లకు డబ్బులు సంపాదించి పెట్టే ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా సినిమా చూడకపోతే కచ్చితంగా ఈ వీకెండ్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చూడండి. అందరికీ థాంక్యూ సో మచ్.

హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఎమోషనల్‌గా ఉంది. ఈ సినిమా చూసి థియేటర్లలో చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఇది నాకు కూడా ఒక ఎమోషనల్ జర్నీ. తెలుగులో నా జర్నీ చాలా స్పెషల్. నేను ఫస్ట్ టైమ్ తెలుగులో ‘మగధీర’ సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ‘ఈగ’, ‘బాహుబలి’ సినిమాలను ఎంతో ఆస్వాదించాను. రాజమౌళి గారు ప్రేక్షకులపై చూపిన ఇంపాక్ట్ అద్భుతం. ఆయన గొప్ప హ్యూమన్ బీయింగ్ కూడా. ఆయన మా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మేమందరం ‘వారణాసి’ కోసం ఎదురుచూస్తున్నాం. మా రచయితలు ఎప్పుడూ నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. బెస్ట్ రైటర్స్, డైరెక్టర్స్ వల్లే ఇది సాధ్యమైంది. తెలుగులో నేను ఎలాంటి సినిమా అయినా చేయగలననే నమ్మకం ఇచ్చారు స్వప్న. ఇప్పుడు గుణ్ణం గంగరాజు గారు, అరవింద్ గారితో కూడా పరిచయం ఏర్పడింది. వీళ్లందరూ నా ఫ్యామిలీ మెంబర్స్‌గా మారారు. అరవింద్ గారు చాలా ఎనర్జీతో ఉంటారు. మా డైరెక్షన్, కెమెరా, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్స్‌లోని అందరికీ థాంక్యూ. అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. సాత్విక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. పవన్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. తను అందరికీ క్రెడిట్ ఇస్తారు. సాత్విక మరెన్నో గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు సినీ పరిశ్రమకు, ఆడియన్స్‌కు కృతజ్ఞతలు. మీరందరూ నాకు ఎంతో ప్రేమను ఇచ్చారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు విజయం సాధించినప్పుడు మరిన్ని మంచి కథలు చెప్పాలనే ఉత్సాహం, ధైర్యం వస్తుంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాజమౌళి గారు త్వరలో ఒక గొప్ప సినిమాను రిలీజ్ చేయబోతున్న ఈ సమయంలో, ఆయన సమయాన్ని ఇలా థాంక్స్ చెప్పడానికి రెండు గంటలు తీసుకోవడం నిజంగా అన్యాయం. కానీ తప్పడం లేదు (నవ్వుతూ). గుణ్ణం గంగరాజు గారి క్రియేటివ్ లెవల్ నెక్స్ట్ లెవల్. ఆయన ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాను నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. 30 ఏళ్ల తర్వాత ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. దుల్కర్ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. తను తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారాడు. ఇందులో కృష్ణ క్యారెక్టర్‌ను తనకంటే ఎవరు బాగా చేయలేరు. సాత్విక తెలుగు సినిమాకు దొరికిన మరొక తార. పవన్ ఫస్ట్ సినిమా చూసినప్పుడే తనతో సినిమా చేయాలనుకున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా తీసి చూపించాడు. ఈ సినిమాను చాలా నిజాయితీగా తీశాడు. అశ్వినీ దత్ నాకు ఇచ్చిన గిఫ్ట్ స్వప్న. తను చాలా వేగంగా పనిచేస్తుంది. విద్య, స్వప్న కలిసి ఈ సినిమా కోసం అద్భుతంగా వర్క్ చేశారు. అందరూ సమిష్టి కృషితో పనిచేయడం వల్లే ఇంత అద్భుతమైన సినిమా తయారైంది. ఈ సినిమా తీసినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ వందనం.

ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాజమౌళి గారికి ధన్యవాదాలు. గంగరాజు గారితో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అరవింద్ గారు గొప్ప ఇన్‌స్పిరేషన్. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఇప్పటికే ఆయన సినిమా అంటే ఎంతో ప్యాషన్‌తో పని చేస్తారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేసి మరింత నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సాత్విక ఈ సినిమాతో తారల మెరిసింది. రుహానితో మళ్లీ కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమాకు దొరికిన ఒక వజ్రం దుల్కర్. తనతో కలసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను.

డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రిమియర్ రోజున రాజమౌళి గారి ప్రతి ఎక్స్‌ప్రెషన్ ఈ సినిమాకు సంబంధించి నాకు ఫస్ట్ రివ్యూ. ఆయన ఈ వేడుకకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కథకు బీజం పడింది సందీప్, రమ్య గారి దగ్గర. ఈ కలను భుజాన వేసుకుంది అరవింద్ గారు. నా డ్రీమ్‌ను స్వప్న గారు నిజం చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు థాంక్యూ. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జీవీ ప్రకాష్ గారు తన మ్యూజిక్‌తో ఈ సినిమాకు ప్రాణం పోశారు. మా నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రుతి ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాత్విక అద్భుతం చేస్తుంది. దుల్కర్ గారు ఒక మ్యాజిక్‌లా ఈ సినిమాకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

హీరోయిన్ సాత్విక వీరవల్లి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అలాగే మా టీమ్‌లో ప్రతి ఒక్కరికీ, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని అందరికీ థాంక్యూ. శ్రుతి హాసన్ గారికి, రుహాని గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా నాకు పని కల్పించింది. దుల్కర్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండిపోమని అడుగుతున్నాను. సినిమాను ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా యూనిట్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ మరో ఎత్తు. అది మీరు థియేటర్‌లోనే చూడాలి. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమా.

ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ఫస్ట్ డే సెకండ్ షో ఈ సినిమా చూశాను. ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఇది ఒక అద్భుతమైన ఐడియా. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఒక స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో చూసిన అత్యద్భుతమైన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రెండు కలిసొస్తున్నాయంటేనే కచ్చితంగా అద్భుతమైన కంటెంట్ ఉంటుందని అర్థం. అలాంటి నమ్మకాన్ని నిజం చేసిన అరవింద్ గారికి, స్వప్న గారికి అభినందనలు. దుల్కర్ గారు వరుసగా విజయవంతమైన సినిమాలు అందిస్తున్నారు. ఆయన కథల ఎంపిక అద్భుతంగా ఉంటుంది. సాత్విక కెరీర్ ఇంకా అద్భుతంగా ఎదుగుతుంది. రాజమౌళి గారు ఈ వేడుకకు రావడం టీమ్ అందరికీ బిగ్ బ్లెస్సింగ్. సినిమా గొప్ప ఇన్‌స్పిరేషనల్, ఎమోషనల్ రైడ్ ఇస్తుంది. రేపు మరోసారి మా ఫ్యామిలీ అందరం కలిసి సినిమాకు వెళ్తున్నాం. ఈ సినిమాను తప్పనిసరిగా థియేటర్‌లో చూడాలి. లేదంటే ఏదో మిస్ అవుతారు. ఇలాంటి సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకుడికి అందరికీ అభినందనలు. సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తే లాంగ్ రన్ ఉంటుంది. అది మేము ‘ఇరుముడి’ సినిమాకు చూశాం. ఈ సినిమా కూడా లాంగ్ రన్ ఆడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

రుహాని శర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాజమౌళి గారికి ధన్యవాదాలు. బిజిలి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు వస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైన కథ చెప్పిన డైరెక్టర్ పవన్ విషయంలో చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చాలా స్పెషల్‌గా కనెక్ట్ అవుతుందని నాకు ముందు నుంచే తెలుసు. నేను ప్లే చేసిన చిన్న పాత్రకు మీరు ఇచ్చిన ప్రేమను మర్చిపోలేను. నా ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఈ పాత్ర చాలా ప్రత్యేకం.

రచయిత గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా ఆకాశమంత విజయం సాధించాలని ఊహిస్తాను. ఈసారి ఆ విజయం కనిపిస్తోంది. బేసిగ్గా సినిమాలకు మౌత్ టాక్ అంటారు. కానీ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హార్ట్ టాక్ అనాలి. కొన్ని వేల గుండెలు స్పందించి మాకు ఈ ఆనందాన్ని ఇచ్చాయని అనిపిస్తోంది. ధన్యవాదాలు.

ప్రొడ్యూసర్ సందీప్ గున్నం మాట్లాడుతూ.. ముందుగా మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. స్వప్న గారు అద్భుతమైన సహకారం అందించారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు, డీఓపీ డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా డిఫికల్ట్ లొకేషన్లలో తీసిన సినిమా ఇది. సుజిత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. జీవీ అద్భుతమైన మ్యూజిక్ అందించి ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఇందులో నటించిన నటీనటులందరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారు. రుహాని, శ్రుతి హాసన్ అద్భుతంగా నటించారు. సాత్విక అందరి మనసుల్ని కదిలించింది. దుల్కర్ గారు ఉండడం వల్లే ఈ సినిమా ఈరోజు ఈ స్థాయిలో ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్లింది. ఇలాంటి సినిమాను అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రొడ్యూసర్ రమ్య గున్నం మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. స్వప్న గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం. మేము పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చింది. రుహాని, శ్రుతి హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే సాత్విక విషయంలో చాలా గర్వంగా ఉంది. మా కలని నిజం చేసిన దుల్కర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here