బుర్రకథ
నిర్మాణ సంస్థ: దీపాల ఆర్ట్స్
నటీనటులు: ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, పథ్వీరాజ్,గాయత్రి గుప్తా, అభిమన్యుసింగ్, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, గీతా సింగ్ తదితరులు
ఆర్ట్: చిన్నా
మ్యూజిక్: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
స్క్రీన్‌ప్లే: ఎస్.కిరణ్, సయ్యద్, ప్రసాద్ కామినేని, సురేష్ ఆరపాటి, దివ్యభవాన్ దిడ్ల
నిర్మాత: హెచ్.కె.శ్రీకాంత్ దీపాల
రచన, దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
రచయిత నుండి దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన తొలి చిత్రం `బుర్రకథ`. రెండు మెదళ్లు ఉండే వ్యక్తి తన ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడనేదే కథ. ఆది సాయికుమార్ హీరోగా నటించారు. టీజర్, ట్రైలర్‌తో సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంది? అనే విషయం తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం.
కథ:
అభిరామ్(ఆది సాయికుమార్)కి రెండు మెదళ్లు ఉంటాయి. ఆ కారణంగా రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటాడు. అభి అనే మాస్ వ్యక్తిగా అందరినీ ఆటపట్టిస్తుంటాడు. మరో పక్క రామ్ అనే క్లాస్ అనే వ్యక్తిగా నటిస్తుంటాడు. రెండు రకాలుగా ఆలోచిస్తున్నానని అభిరామ్‌కి తెలిసినా, తన సమస్య కారణంగా అందరికీ ఓ పక్క సమస్యగా మారుతాడు. తల్లిదండ్రులు కూడా అభిరామ్ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. రామ్, హ్యాపీ (మిస్తి చక్రవర్తి)ని ప్రేమిస్తాడు ముందు రామ్‌ను హ్యాపీ తిరస్కరించినా.. అతని గురించి తెలుసుకుని ప్రేమిస్తుంది. అయితే హ్యాపీ తండ్రి ప్రభుదాస్ ఓ కండీషన్ పెడతాడు. ఆ కండీషన్ ఏంటి? దాని వల్ల అభి రామ్‌కు వచ్చే సమస్య ఏంటి? రామ్‌కు, గగన్‌కు ఉండే గొడవ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. హీరో ఆది ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ పాత్రను ఆది సాయికుమార్ `బుర్రకథ` చిత్రంలో పోషించాడనే చెప్పాలి. ఇద్దరు వ్యక్తులుగా నటించడం కాదు. ఒక వ్యక్తి రెండు విభిన్నమైన మనస్తత్వాలుండే వ్యక్తిగా చేయడమంటే కష్టతరమైన విషయమే. ఆది రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ను ఆది చక్కగా చూపించాడు. అభి అనే మాస్ పాత్రలో మెప్పించిన ఆది.. రామ్ అనే క్లాస్ కుర్రాడి పాత్రలోనూ నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఇక మిస్తీ పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకుంటే.. నైరా షా పాత్ర చిన్నదే అయినా గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆది తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్నేహితుడిలా ఉండే తండ్రి పాత్రతో పాటు.. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన పోసాని కామెడీ పండిచే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో పోసాని ఆకట్టుకున్నాడు.
సన్యాసి పాత్రలో ఆది చేసే నటనతో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఆది నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక మాస్‌ను ఆకట్టుకునేలా చాలా సన్నివేశాలున్నాయి. ఇక బొంగరం హేమ అనే డిఫరెంట్ పాత్రలో థర్టీ ఇయర్స్ పృథ్వీ ప్రేక్షకులను నవ్వించాడు. పాటలు, ఆది డ్యాన్సులు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా పనితనం బావుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో సంభాషణలు బావున్నాయి. డైరెక్టర్ డైమండ్ రత్నబాబు తన పరిధి మేర ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సినిమాను తెరకెక్కించాడు. పాత్రల చిత్రీకరణ, ఎమోషనల్ సన్నివేశాలను మంచి డైలాగ్స్‌తో తెరకెక్కించాడు రత్నబాబు. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్:బుర్రకథ.. కొత్త ప్రయత్నం
రేటింగ్: 3/5