ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని ప్రశంసించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్….!!

0
44

టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన చిత్రాలలో విభిన్న కథ, కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్లు సాధిస్తున్న చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చాలా రోజుల తరువాత తెలుగులో డిటెక్టీవ్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు స్వరూప్ ప్రేక్షకులను ఆకట్టుకునెలా తీయడంలో పూర్తిగా సఫలమయ్యారు. ఇక ఈ చిత్రంపై కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక, పలువురు చిత్ర రంగ ప్రముఖులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం లోని హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు స్వరూప్ లను కలిసి మంచి హిట్ కొట్టినందుకు వారిని ప్రశంశిస్తూ, ఈ సినిమాపై పై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఇవాళ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం చూసాను, చాలా బాగుంది. ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో మంచి వినోదాత్మకంగా సాగిందని అయన అన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తనటుల,దర్శకుల రాక శుభపరిణామమని, మరియు వారు చేస్తున్న ఈ కొత్త తరహా ప్రయత్నాలు ఎంతైనా అబినందింగదగ్గవని, తన తరపున చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రాలు చూడాలి అనుకునేవారికి ఈ చిత్రం మంచి చాయిస్ అని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here