రేపు సూర్య బందోబస్త్ చిత్ర టీజర్ ను విడుదల చేయనున్న దగ్గుబాటి రానా…!!

0
65

తమిళ సూపర్ స్టార్ సూర్య ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో షూటింగ్ చివరిదశకు చేరుకున్న చిత్రం బందోబస్త్. ప్రస్తుతం తమిళంలో కాప్పన్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో బందోబస్త్ పేరుతో అనువదిస్తున్నారు. సూర్య ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటులు మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సాయేషా, ఆర్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ను రేపు యంగ్ హీరో దగ్గుబాటి రానా తన చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సూర్య హీరోగా గతంలో వీడోక్కడే, బ్రదర్స్ వంటి వెరైటీ చిత్రాలను తీసి మంచి సక్సెస్ అందుకున్నదర్శకుడు కెవి ఆనంద్, ఈ చిత్రాన్ని కూడా ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమిళ భాషలో విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ వీక్షకుల అభిమానాన్ని సంపాదించి చిత్రంపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here