“కౌసల్య కృష్ణమూర్తి” ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథులుగా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, హీరోయిన్ రాశి ఖన్నా…..!!

0
469

దివంగత నటులు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘కౌశల్య కృష్ణమూర్తి’. ఇటీవల తమిళంలో విడుదలై మంచి సక్సెస్ ని అందుకున్న ‘కనా’ చిత్ర అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్ర టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా విడుదలై, ఇప్పటికే యూట్యూబ్ లో మంచి స్పందనను రాబట్టింది. ఇటీవల విడుదలైన ముద్దబంతి పూవు పాట శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది .ఇక ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకను రేపు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా భారతీయ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, మరియు టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా విచ్చేయనున్నారు. విభిన్నమైన కథ, ఆకట్టుకునే కథనాలతో గ్రామీణ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం, అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.  క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావు సమర్పణలో కె ఏ వల్లభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here