“మల్లేశం” చిత్రాన్ని ప్రశంసించిన సమంత అక్కినేని….!!

0
112

ఆసు యంత్రం రూపకర్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శ్రీ చింతకింది మల్లేశం గారి జీవిత గాథ ఆధారంగా రూపొందిన కొత్త చిత్రం మల్లేశం. హాస్యనటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు మరియు పలువురు సినీ ప్రముఖుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

నేడు ఈ చిత్రంపై హీరోయిన్ అక్కినేని సమంత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఇవాళ మల్లేశం చిత్రాన్ని చూడడం జరిగింది. వాస్తవికతకు దగ్గరగా ఎంతో హృద్యంగా తెరకెక్కి, తెలంగాణ ప్రాంత సంస్కృతిని ప్రతిబింభించేలా ఉంది ఈ చిత్రం. అంతేకాక తల్లి కొడుకులు మధ్య అనుబంధాన్ని ఎంతో గొప్పగా చూపించారు, నటుడు ప్రియదర్శి, నటి ఝాన్సీ అద్భుతంగా నటించారు. ఇక నేతన్నలు అలానే చేనేత గొప్పతనాన్ని ఎంతో చక్కగా చూపించారంటూ ఆమె పోస్ట్ చేయడం జరిగింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడిగా అనన్య నటించింది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించారు. రాజ్‌ ఆర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా శ్రీ అధికారి నిర్మించారు. మార్క్‌ కే రోబిన్‌ సంగీతం అందించడం జరిగింది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here