అంచనాలు పెంచిన “దొరసాని” ట్రైలర్….!!

0
410

టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలిసారి తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం దొరసాని. కొన్నేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక యదార్ధ గాధకు స్ఫూర్తిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. హీరో రాజశేఖర్ మరియు జీవితల కుమార్తె శివాత్మిక ఈ చిత్రంతో హీరోయినిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. నూతన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, మరియు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.

వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ ఆద్యంతం 90 ల కాలమానాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని ప్రతిబింబిస్తూ ఎమోషనల్ గా సాగే హృద్యమైన ప్రేమకథ గా దొరసాని ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆనంద్, శివాత్మికా ఇద్దరూ ట్రైలర్ లో తమ నటన, డైలాగులతో ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేష్ బాబు, సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, ఎడిటర్ : నవీన్ నూలి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి, పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని, రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here