టాలీవుడ్ లో యాంగ్రీ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు డాక్టర్ రాజశేఖర్. కెరీర్ లో ఎన్నో అత్యద్భుతమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన రాజశేఖర్ గారు ప్రస్తుతం నటించిన కల్కి చిత్రం విజయంతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని రాజశేఖర్ గారి కుమార్తెలు శివాని, శివాత్మిక, మరొక నిర్మాత సి కళ్యాణ్ గారితో కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది.
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మాతల్లో ఒకరైన శివాని కి కల్కి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా అభినందనలు తెల్పుతూ కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది.


