వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ‘వాల్మీకి’ ప్రీ టీజర్ విడుదల తేదీ ఖరారు….!!

0
117

మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్, ప్రస్తుతం పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం వాల్మీకి. ఇటీవల తమిళంలో విజయవంతమయిన జిగర్తాండ చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం పై మొదటి నుండి ఎన్నో అంచనాలున్నాయి. ఇక ఇటీవల ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తన లుక్ ని రివీల్ చేసిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్ర ప్రీ టీజర్ ని ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటల 18 నిమిషాలకు విడుదలచేయాలని చిత్ర బృందం నిర్ణయించింది, ఈ మేరకు కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.

ఒరిజినల్ మాతృకకు మన తెలుగు నేటివిటీని జోడించి హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తమిళ హీరో అథర్వ మురళి,  పూజ హెగ్డే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here