యాంగ్రీ హీరోగా గతంలో పలు చిత్రాల్లో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటులు రాజశేఖర్. ఇటీవల పిఎస్వి గరుడ వేగా సినిమాతో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్, ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న నూతన చిత్రం కల్కి. 1980ల కాలం నాటి కథగా ఒక వినూత్న కథాంశంతో రూపొందిన కల్కి చిత్ర టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది.
ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలోని తొలిపాటగా విడుదలైన ‘హారన్ ఓకే ప్లీజ్’ పాట మంచి సక్సెస్ అవడంతో, ఈ చిత్రంలోని ‘ఎవరో ఎవరో’ అనే పల్లవితో సాగే రెండవ పాటను రేపు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కాసేపటి క్రితం ప్రకటించింది. రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేతా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుధీష్, హరీష్ ఉత్తమన్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 28 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.