ఇస్మార్ట్ శంకర్ విడుదల తేదీ మార్పు….!!

0
416

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇక షూటింగ్ ప్రారంభం నాటి నుండి మంచి అంచనాలు సంపాదించిన ఈ చిత్రంపై, ఇటీవల విడుదలైన పాటలు, మరియు ఫస్ట్ లుక్ టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని తొలుత జులై 12న విడుదల చేయాలని సంకల్పించారు.

అయితే ఆ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్ ఉండడం వలన తమ చిత్రాన్ని జూలై 18కి వాయిదా వేసినట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రామ్ సరసన అందాల భామలు నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా నటి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తన పూరి టూరింగ్ టాకీస్,పిసి కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here