’22’ చిత్ర టైటిల్ ని అనౌన్స్ చేసిన సెన్సషనల్ డైరెక్టర్ వివి వినాయక్…!!

0
264

సెన్సషనల్ డైరెక్టర్ వివి వినాయక్ నేడు ఒక నూతన చిత్రానికి టైటిల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. నూతన నటుడు రూపేష్ కుమార్ చౌదరి , మరియు నటి సలోని మిశ్ర కలయికలో బి శివకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ’22’ అనే టైటిల్ ని ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధుల్లో ఒకరుగా విచ్చేసిన దర్శకులు వినాయక్  అనౌన్స్ చేయడం జరిగింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ, అలానే నిర్మాతలు సి కళ్యాణ్, కొండా కృష్ణంరాజు ఈ కార్యక్రమానికి ఇతర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘మాయి ప్రొడక్షన్స్’ లోగోను నిర్మాత సి కళ్యాణ్ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. మాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుశీల దేవి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ గా బ్రహ్మ కడలి, కొరియోగ్రాఫర్ గా ఆని మాస్టర్ వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here