అల్లరి నరేష్, సురభి ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘నా కంటి మీద కునుకే’ రిలీజ్

0
4
Naa Kanti Meedha Kunuke From Ramba Oorvasi Menaka Unveiled
Naa Kanti Meedha Kunuke From Ramba Oorvasi Menaka Unveiled

అల్లరి నరేష్, సురభి ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’ నుంచి రొమాంటిక్ మెలోడీ ‘నా కంటి మీద కునుకే’ రిలీజ్

గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “Comedy Goes Cosmic” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట ‘నా కంటి మీద కునుకే’ను విడుదల చేశారు. అల్లరి నరేష్, సురభిపై చిత్రీకరించిన ఈ పాట సినిమాలోని రొమాంటిక్ కోణాన్ని పరిచయం చేస్తూనే, గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు అందమైన అనుభూతిని అందిస్తోంది.

పచ్చని పల్లె అందాల నడుమ తెరకెక్కిన ఈ పాటలో, తన కలల రాణిపై మనసుపడిన యువకుడు తన ప్రేమను, అభిమానాన్ని అందంగా ప్రజెంట్ చేశారు. అల్లరి నరేష్, సురభి మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ గ్రామీణ సంగీతపు మాధుర్యాన్ని మోడరన్ ఆర్కెస్ట్రేషన్‌తో మేళవిస్తూ హాయిగా సాగే మెలోడీని అందించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ప్రేమలోని మధురమైన భావాలను అందంగా ఆవిష్కరించగా, ధనుంజయ్ సీపాన తన వోకల్స్ తో పాటకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చారు. జిత్తు మాస్టర్ అందించిన కోరియోగ్రఫీ, అందమైన లొకేషన్స్‌తో కలిసి కనుల విందుగా వుంది.

ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరందరూ తమదైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు మరింత వినోదాన్ని అందించనున్నారు.

ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డిజైన్‌ను రూపొందించగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్.

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపి: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here