మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

0
2
Chennai Love Story Pre Release Event
Chennai Love Story Pre Release Event

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు నరేష్ మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ రవి గారికి థ్యాంక్స్. ఈ రోజు ఆయన బర్త్ డే. ఆయనకు మనందరి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సాంగ్స్, ట్రైలర్ లాగే మా సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

నటుడు మహేందర్ మాట్లాడుతూ – ఈ మూవీ టీమ్ తో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా సినిమా బుకింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. టికెట్ బుక్ చేసుకుని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నటి సిరి హన్మంతు మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో మేమంతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశాం. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు గురువారం నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మీరంతా మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంతో హీరోయిన్ గౌరికి, హీరో కిరణ్ గారికి మంచి సక్సెస్ అందించాలి. అన్నారు.

నటి పూజ మాట్లాడుతూ – ఈ సినిమాలో మంచి రోల్ చేశాను. డైరెక్టర్ రవి గారు క్యారెక్టర్ కు సంబంధించిన ప్రతి డీటెయిల్ విషయాన్ని వివరించేవారు. ఈ సినిమా టీమ్ మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే మేమంతా కొంచెం బరువు కూడా పెరిగాం. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు నవీన్ మాట్లాడుతూ – మా ఫ్యామిలీలో అందరికీ చిరంజీవి గారంటే చాలా అభిమానం. మా మూవీ టీమ్ అందరిలోనూ మెగాస్టార్ పట్ల అంతే అభిమానాన్ని చూశాను. చిరంజీవి గారి లాగే మా కిరణ్ గారు కూడా కష్టపడి పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రం ఆయనకు మరింతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించి పెడుతుంది. శ్రీ గౌరి ప్రియ మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. మనతో పాటే ఆమె నివి క్యారెక్టర్ వచ్చేస్తుంది. అంత బాగా పర్ ఫార్మ్ చేసింది. చెన్నై లవ్ స్టోరీ ప్రేక్షకులకు ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోతుంది. అన్నారు.

డీవోపీ డేనియల్ విశ్వాస్ మాట్లాడుతూ – ఈ కథ విన్నప్పుడు నేను ఎంత ఎమోషన్ కు ఫీల్ కు గురయ్యానో థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు మీరు అలాంటి అనుభూతికే లోనవుతారు. ఈ సినిమాలో కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ మనల్ని ఉద్వేగానికి గురిచేస్తుంది. అలాగే ఈ సినిమాతో గౌరి ప్రియ నటిగా మరింత ఎత్తుకు ఎదుగుతుంది. నేను ఈ మూవీకి జస్టిఫై చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రవి గారికి, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. మా మూవీ ఈవెంట్ కు చిరంజీవి గారు అతిథిగా రావడం చాలా హ్యాపీగా ఉంది. అన్నారు.

త్రిగుణ్ మాట్లాడుతూ – ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాను. ఇంపాక్ట్ ప్లేయర్ లా నా పాత్ర ఉంటుంది. గౌరి ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అనే ఇంప్రెషన్ ఇండస్ట్రీలో ఉంది. ఈ సినిమాకు కూడా ఆ మ్యాజిక్ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. మణి గారు కంపోజ్ చేసిన పాటలన్నీ హిట్ అయ్యాయి. రవి నంబూరి, ఎస్ కేఎన్, సాయి రాజేష్ ఈ సినిమాకు త్రిమూర్తులు అనుకోవచ్చు. చెన్నై లవ్ స్టోరీ మీకు గుర్తుండిపోయే ప్రేమ కథ అవుతుంది. అన్నారు.

లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ – ఇలాంటి కథను తెరకెక్కించాలంటే సొమ్ముతో పాటు దమ్ముండాలి. అలాంటి దమ్మున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. తొలి చిత్ర దర్శకుడైనా ఈ సినిమాను రవి నంబూరి చాలా స్పష్టతతో తెరకెక్కించాడు. ఈ చిత్రంలోని ఏడు పాటలు బోయిలా ఈ కథను మోశాయి. కిరణ్, గౌరి ప్రియ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – నాకు ఇంటెన్స్ లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. బేబి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసి మళ్లీ తక్కువ టైమ్ లోనే చెన్నై లవ్ స్టోరీతో మరో ఎమోషనల్ ఇంటెన్స్ లవ్ స్టోరీని తీసుకొస్తున్నారు ఎస్ కేఎన్, సాయి రాజేష్ గారు. నేను కూడా మీలాగే ఈ నెల 24న ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నా. ఓటీటీ మార్కెట్ వెంట సినిమా పరుగులు పెడుతున్న ఈ ట్రెండ్ లో మనసు, ఫీలింగ్స్ అనేవి మనకు గుర్తుచేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి ప్రేమ కథల్ని క్వాలిటీగా మంచి కాస్టింగ్ తో తెరకెక్కించడం సంతోషంగా ఉంది. కిరణ్ గారు ఈ సినిమాతో యూత్ గుండెల్లో పాగా వేసుకుంటారని నమ్ముతున్నాను. ట్రైలర్ లో గౌరి గారిని చూస్తుంటే ఇలాంటి మాణిక్యాలను వెతికి మన సినిమాల్లో పెట్టుకోవాలని అనిపించింది. అన్నారు.

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – నా కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి మంచి క్యారెక్టర్ దక్కడం సంతోషంగా ఉంది. బరువు బాధ్యత ఆటిట్యూడ్, అహంకారం ఉన్న పాత్రలో నటించాను. ఒక డెప్త్ ఉన్న పాత్ర నాది. మా మూవీకి రవి గారు, ఎస్ కేఎన్ గారు, సాయి రాజేష్ గారు ఫిల్లర్స్ లా నిలబడ్డారు. డైరెక్టర్ రవి నాకు సోదరుడి లాంటివారు. ఒక సోదరిలా ఆయన గెలవాలని కోరుకున్నా. రవి నంబూరి అనే పేరు ఇండస్ట్రీలో వినిపించాలి. కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ ను కోస్టార్ గా ఫస్ట్ చూసింది నేనే. స్టీవెన్ క్యారెక్టర్ కు వందశాతం కిరణ్ గారు న్యాయం చేశారు. మణిగారు అద్భుతమైన సాంగ్స్ చేశారు. అనంత శ్రీరామ్ గారు అంతే మంచి సాహిత్యం అందించారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ- ఈ వేదిక మీద నా గురువు మారుతి గారిని మిస్ అవుతున్నా. ఆయన నాలోని డైరెక్టర్ ను చూడకపోతే ఈ రోజు ఈ వేదిక మీద ఉండేవాడిని కాదు. ఎస్ కేఎన్ కోసం బేబి సినిమాకు వర్క్ చేసేందుకు వెళ్లినప్పుడు సాయి రాజేష్ ఎవరో నాకు తెలియదు. కానీ ఆయనతో వర్క్ చేశాక ఆయన రాసే మాటలు, మ్యూజిక్ మీద ఉన్న కమాండ్ చూసి అద్భుతం అనిపించింది. బేబి మూవీ సక్సెస్ తర్వాత ఒకరోజు పిలిచి చెన్నై లవ్ స్టోరీ కి డైరెక్షన్ చేయమని అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కిరణ్ అన్న, గౌరి నాకు ఇచ్చిన సపోర్ట్ జీవితాంతం మర్చిపోలేను. సెకండాఫ్ లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట్లాడుకోరు. కొత్త దర్శకుడైన నన్ను కిరణ్ అన్న నమ్మి సినిమా చేశారు. నా ఫస్ట్ హీరోగా కిరణ్ అన్నని మర్చిపోలేను.

ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్. ఈ సినిమా గ్లింప్స్ చూసినప్పటి నుంచే ఇది సూపర్ హిట్ అనే నమ్మకం కలిగింది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ – మెగాస్టార్ చిరంజీవి గారు చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ ను ఆశీర్వదించేందుకు రావడం సంతోషంగా ఉంది. ఎస్ కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ బేబి సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. ఈ సినిమాతో బేబి సినిమాను మించిన హిట్ కొట్టబోతున్నారనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం వేసే ప్రీమియర్ షోస్ అన్నీ ఫాస్ట్ గా ఫుల్ అవుతున్నాయంటే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏంటనేది అర్థమవుతోంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్, స్టోరీ రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – మా అన్నయ్య మా కోసం వచ్చారు. ఈ రోజు నన్ను హీరోను చేశారు. శిల్పకళావేదిక చిరంజీవి గారి అభిమానులకు ఒక ఎమోషన్. మన అభిమానులకు ఈ ఆడిటోరియంతో ఎన్నో ఎక్సిపీరియన్స్ లు ఉంటాయి. చిరంజీవి గారు మా ఈవెంట్ కు వస్తున్నారని తెలియగానే ఎంతోమంది స్నేహితులు ఫోన్ చేసి అడిగారు. మా సినిమా ఈవెంట్ కు మీరొస్తే మా మూవీకి హెల్ప్ అవుతుంది అన్నయ్య అని అడిగితే, నేను వస్తున్నా అంటూ వచ్చారు. అన్నయ్య చిరంజీవి గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – బాస్ అంటే మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట..అదీ మెగాస్టార్ అంటే. ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి మిడిల్ క్లాస్ వారికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడే మెగాస్టార్. మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మెగాస్టార్ గారే కదిలి రావడం సంతోషంగా ఉంది. నాకు, సాయి రాజేష్ కు ఫైనాన్స్ లెక్కలు తెలియవు. ఒక మంచి సినిమాను వీలైనంత క్వాలిటీగా నిర్మించడమే తెలుసు. కిరణ్ గారు ఈ కథ చెప్పగానే నేను చేస్తాను అని ముందుకొచ్చారు. నా స్నేహితుడు రవి నంబూరి కొత్త దర్శకుడైనా అద్భుతంగా రూపొందించారు. మా సినిమాను క్లాసిక్ లవ్ స్టోరీగా చేయాలనుకున్నప్పుడు ఆ స్థాయి మ్యూజిక్ ఇచ్చారు మణిశర్మ గారు. ఇది ప్రమోషనల్ ఈవెంట్ కాదు మాకు ఎమోషనల్ ఈవెంట్. రేపు సాయంత్రం అన్ని మెయిన్ సెంటర్స్ లో ప్రీమియర్స్ వేస్తున్నాం. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ హానెస్ట్ లవ్ స్టోరీ. మీ కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమాకు వెళ్లండి. బాస్ అభిమానులగా మేము ఎప్పుడూ మంచి ప్రేమ కథల్నే తెరకెక్కిస్తాం. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఈ శిల్పకళావేదికలో మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల ఎన్ని ఈవెంట్స్ చూసి ఉంటాం. ఎక్కడో మా ఊర్లో ఉండి టీవీలో మెగాస్టార్ సినిమా ఈవెంట్స్ చూసేవాడిని. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు అతిథిగా రావడం నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. డ్యాన్సులైనా, పర్ ఫార్మెన్స్ అయినా, స్వాగ్ అయినా మెగాస్టార్ ఎప్పుడూ మనకు ప్రత్యేకమే. మా అన్నయ్య మెగాస్టార్ అభిమాని. నేను పవర్ స్టార్ అభిమానిని. థియేటర్స్ లో మేము కట్టిన బ్యానర్స్, చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరంజీవి అనేది ఒక పేరు కాదు ఎమోషన్. మీరు ఎవరెస్ట్ మీద కూర్చుని మమ్మల్ని కూడా అలసిపోకుండా అక్కడికి పరుగులు పెట్టండి అంటూ ఇన్స్ పైర్ చేస్తున్నారు. మీరూ అఛీవ్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంటారు. అప్పుడు అనిపిస్తుంటుంది మనమూ చిరంజీవినే కదా అని. మా ప్రొడ్యూసర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ లకు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ మా అందరినీ ముందుకు నడిపిస్తూ ఉండేది. నివి లేకుంటే స్టీవెన్ లేడు. రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన రైటింగ్ కు మీరంతా ఎమోషన్ అవుతారు. క, కె ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ చిత్రంలో నేను చేసిన స్టీవెన్ శంకర్ రోల్ నాకెంతో ప్రత్యేకం. నాకు పర్సనల్ గా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఇది. నా మాటగా చెబుతున్నా మీ ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ టైటిల్ వినగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ప్రేమ గుర్తుకువచ్చాయి. ఆ రోజుల్లో చెన్నై నగరానికి వెళ్లినప్పుడు అక్కడి స్టూడియోలు చూసినప్పుడు ఇక్కడ కదా మన ఆశలు నెరవేరేది అనిపించేది. ఈ స్టూడియోల్లో కదా మనం నటుడిగా పేరు తెచ్చుకుని నిలదొక్కుకోవాలి అనే ఆశ కలిగేది. అదే చెన్నై రోడ్ల మీద అవకాశాల కోసం తిరిగాం. అదే రోడ్ల మీద స్టార్స్ స్టేటస్ లో కార్లలో తిరిగాం. ఆ రోజులన్నీ చెన్నై లవ్ స్టోరీ టైటిల్ అనగానే మదిలో మెదిలాయి. ఈ టైటిల్ ఆ మ్యాజిక్ ఉంది. యంగ్ స్టర్స్ చేస్తున్న సినిమా, నా అభిమానులు చేసిన సినిమా కాబట్టి ఈ ఈవెంట్ కు వచ్చాను. ఎస్ కేఎన్, సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం, మణిశర్మ..ఇలా వీళ్లంతా నా మీద పెంచుకున్న అభిమానం, ప్రేమ నన్ను ఈ వేదిక మీద నిలబడేలా చేశాయి. నా అభిమానులను ఇష్టపడతాను. నా అభిమానులు ఎదిగితే ప్రాణప్రదంగా చూసుకుంటాను. నన్ను అభిమానించడమే కాదు మీరు ప్రయోజకులై, మీ కుటుంబానికి, సమాజానికి పేరు తీసుకొచ్చి, అందరూ గర్వపడేలా చేస్తే అదే నాకు నిజమైన సంతోషం. అదే నాపై మీరు చూపించే నిజమైన ప్రేమగా భావిస్తాను. అలాంటి అభిమానులను చూసి ముచ్చటపడుతుంటాను. ఈ వేదిక మీద అలాంటి అభిమానులను చూసి ఆనందానికి లోనవుతున్నాను. ఏదో పిలిచారు కదా అని ఈవెంట్ కు వచ్చి విశెస్ అందించి వెళ్లిపోవడం కాదు మీ అభిమానం తాలుక వైబ్రేషన్ అనుభవించాలని, మనస్ఫూర్తిగా ఈ టీమ్ ను ప్రోత్సహించాలని వచ్చాను. నా అభిమాని ఎస్ కేఎన్ జర్నలిస్ట్, పీఆర్ఓ గా ఉంటూ ప్రొడ్యూసర్ గా ఎదిగి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించడం నాకు సంతోకరం. అలాగే సాయి రాజేష్ తన రచన ప్రతిభతో , దర్శకత్వ ప్రతిభతో విజయాలు సాధిస్తున్నాడు. ఎస్ కేఎన్ తో కలిసి మంచి మూవీస్ నిర్మిస్తున్నాడు. సాయి రాజేష్ రెండు నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానులకు తలమాణికంలా నిలిచాడు. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. రవి నంబూరి నా గురించి బాగా మాట్లాడాడు. వీళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కలలు కనండి, వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు. నేనే అందుకు ఉహాదారణ. కంఫర్ట్ జోన్ వదిలేయాలి, కష్టానికి ఎదురెళ్లాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయండి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహామహుల ఉన్న ఇండస్ట్రీలో నేనేం ప్రత్యేకత చూపించగలను అని ఆలోచించి అలా కష్టపడి మీ అభిమానం పొందాను. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. థియేటర్ లో చిరంజీవి సినిమా చూడటమే కాదు నేను అలా ఎందుకు కాకూడదు అనుకున్నాడు కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తను కూడా ఎంతోమంది కొత్త వాళ్లకు ఇన్స్ పిరేషన్ గా నిలుస్తున్నాడు. నాలుగైదు మంచి హిట్స్ అందుకున్నాడు. మీ ఆదరణ పొందాడు కిరణ్. చెన్నై లవ్ స్టోరీతో కూడా కిరణ్ మీ ప్రేమాభిమానాలు పొందుతాడు. కిరణ్ లాంటి కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి రావాలి అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. గౌరి ప్రియ కుందనపు బొమ్మలా ఉంది. గౌరి తెలుగుమ్మాయి, తమిళ చిత్రాలతోనూ పేరు తెచ్చుకుంటోంది. మణిశర్మ నా సోదరుడు. ఆయన కంపోజ్ చేసిన ఎన్నో మంచి పాటలకు డ్యాన్సులు చేసి మిమ్మల్ని అలరించాను. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తూ సపోర్ట్ గా నిలుస్తున్న మైత్రీ ప్రొడ్యూసర్స్ రవి, నవీన్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. అన్నారు

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, సిరి హన్మంతు, మహేందర్, నరేష్, పూజ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here