‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్

0
8
Maremma Release On September 10
Maremma Release On September 10
మాధవ్, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ని  ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.

కొత్తగా విడుదలైన పోస్టర్‌లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో ఆయన పాత్రలోని రా ఇంటెన్సిటీతో పాటు భావోద్వేగాలను బలంగా చూపించారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ అఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తోంది.

మారెమ్మ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు, ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో మేకర్స్ విజయవంతమయ్యారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మారెమ్మ’ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలతో మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.  మాధవ్ తన నటనకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న పాత్రలో,  యాక్షన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను ఆవిష్కరించనున్నారు.

ఈ చిత్రంలో దీపా బాలు కథానాయికగా నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తుండగా, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ, దేవ్ రాథోడ్ ఎడిటింగ్, రాజ్‌కుమార్ మురుగేసన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

థియేట్రికల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ‘మారెమ్మ’ ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx : చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here