బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

0
45
Shwethaprasad Recieves Bismillah Khan Award

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమాతోపాటు పలు విజయవంతమైన చిత్రాల్లో గాయనిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు దక్కింది. దేశ విదేశాల్లో కూడా పలు ప్రోగ్రామ్ లలో పాల్గొన్న ఈమె వీణావిద్వాంసురాలు కూడా. హైదరాబాద్ కు చెందిన శ్వేతప్రసాద్ కర్నాటక సంగీత విభాగం 2022-23 సంవత్సరానికిగాను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సాంస్క్రుతిక కార్యదర్శి ఉమ నండూరి, సంగీత నాటక అకాడమీ వైస్ ఛైర్మన్ సంధ్య లు అవార్డును శ్వేతప్రసాద్ కు అందజేశారు. కళాకారులకు ఇటువంటి అవార్డులు రావడంతో ప్రతిభ మరింత ద్విగుణీక్రుతం అవుతుందనే అభిప్రాయాన్ని శ్వేతప్రసాద్ వ్యక్తం చేశారు. తనను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారానికి ఎంపికచేసి అందజేయడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here