‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది.. ప్రెస్ మీట్‌లో నిర్మాత రామ్ తాళ్లూరి

0
60
Vikkatakavi On ZEE 5 Press Meet
Vikkatakavi On ZEE 5 Press Meet
‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది.. ప్రెస్ మీట్‌లో నిర్మాత రామ్ తాళ్లూరి

 

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ క్రమంలో సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో..

Vikkatakavi On ZEE 5 Press Meet
Vikkatakavi On ZEE 5 Press Meet

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్ అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారింది. అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను జీ5 నిర్మించింది. కంటెంట్ చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. దర్శకుడు ప్రదీప్‌కు చాలా మంచి పేరు వస్తుంది. చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. సాగర్, మహేంద్ర ఇలా అందరూ కష్టపడి చేశారు. నరేష్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి విజయాలు దక్కాలి. మేఘా ఆకాష్ అద్భుతంగా నటించారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జీ5లో నవంబర్ 28న ఈ సిరీస్‌ను అందరూ చూడండి’ అని అన్నారు.

నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. ‘జీ5లో నేను పసుపు కుంకుమ సీరియల్ చేశాను. ఇప్పుడు లీడ్‌గా వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను. రామ్ తాళ్లూరి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. దేశ్ రాజ్ పట్టు పట్టి నాకు ఈ పాత్రను ఇచ్చారు. పరువు వెబ్ సిరీస్ చూసి నన్ను అనుకున్నందుకు థాంక్స్. షోయబ్ మా అందరినీ అద్భుతంగా చూపించారు. ఇంత క్వాలిటీతో తెలుగులో ఓ సిరీస్ రాలేదనిపించింది. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అద్భుతంగా సెట్స్ వేసి ఇచ్చారు. డైరెక్టర్ పక్కనే కూర్చుని అన్నీ గమనిస్తుంటారు. మేఘా ఆకాష్ గారితో పని చేయడం సంతోషంగా ఉంది. చాలా చక్కగా నటించారు.  ప్రదీప్ గారు అద్భుతంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 28న జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Vikkatakavi On ZEE 5 Press Meet
Vikkatakavi On ZEE 5 Press Meet

మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ‘సాయి తేజ గారు అద్భుతంగా ఈ కథను రాశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. ప్రదీప్ గారి డైరెక్షన్ టీం ఎంతో సహకరించింది. నరేష్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. వికటకవి నవంబర్ 28న జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. ‘సర్వం శక్తిమయం తరువాత ఏ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో రామ్ తాళ్లూరి గారిని కలిశాను. ఈ కథను ఆయన వినిపించారు. నాకు అద్భుతంగా నచ్చింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్. అద్భుతమైన టీం సెట్ అయింది. షోయబ్ కెమెరా వర్క్, అజయ్ మ్యూజిక్, గాయత్రి క్యాస్టూమ్, కిరణ్ ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి. నరేష్ అగస్త్యను మత్తు వదలరా నుంచి ఫాలో అవుతున్నాను. ఆయనతో పని చేయాలని అనుకుంటూ ఉన్నాను. నరేష్ అద్భుతంగా నటించారు. ధనుష్ తూటా చిత్రంలో మేఘా నటన నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో లక్ష్మీ పాత్రను మేఘా ఆకాష్ చక్కగా పోషించారు. మా వెబ్ సిరీస్ జీ5లో నవంబర్ 28న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Vikkatakavi On ZEE 5 Press Meet
Vikkatakavi On ZEE 5 Press Meet

దర్శక, రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘‘వికటకవి’లో నాలుగు ఎపిసోడ్స్ ఆల్రెడీ చూశాను. అద్భుతంగా ఉంది. సంగీతం, కెమెరా వర్క్, క్యాస్టూమ్ ఇలా అన్ని అద్భుతంగా సెట్ అయ్యాయి. అజయ్ మ్యూజిక్ అదిరిపోయింది. నరేష్, మేఘా ఆకాష్ అద్భుతంగా నటించారు. అమిత్ పాత్ర బాగుంటుంది. ప్రదీప్‌కు చాలా మంచి పేరు వస్తుంది. డైరెక్టర్‌గా ప్రదీప్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాడు. నవంబర్ 28న జీ5లో ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘రామ్ తాళ్లూరి గారి ప్రోత్సాహం వల్లే నేను వికటకవి లాంటి కథలు రాయగలిగాను. ఈ కథను చెప్పేందుకు జీ5కి వెళ్లాను. కానీ వాళ్లు నన్ను కంటెంట్ హెడ్‌గా ఉండమని అన్నారు. ఈ కథ ఓకే అయ్యాక డైరెక్టర్ గురించి చర్చలు జరిగాయి. నేను ప్రదీప్ మద్దాలి పేరు చెప్పడంతోనే అంతా ఒప్పేసుకున్నారు. ఆయన ది బెస్ట్ ఇస్తారని అంతా నమ్మాం. ఇచ్చిన బడ్జెట్‌లో అద్భుతమైన క్వాలిటీ ఇచ్చే కెమెరామెన్ కోసం చూశాం. షోయబ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అజయ్ బీజీఎం అదిరిపోయింది. కిరణ్ ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. నరేష్ అగస్త్య తెలంగాణ షెర్లాక్ హోమ్‌లా అనిపిస్తుంది. నరేష్, మేఘా ఆకాష్ అద్భుతంగా నటించారు. నవంబర్ 28న జీ5లో మా వెబ్ సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. ‘సాయి చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. క్లైమాక్స్ ఊహించలేకపోయాం. రామ్ గారి వల్ల ఈ ప్రాజెక్ట్ మరింత పై స్థాయికి వెళ్లింది. ఈ సిరీస్ హాట్ టాపిక్ కానుంది. జీ5లో నవంబర్ 28న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ.. ‘ప్రదీప్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ టైంలోనే ఓ డెమో ఇచ్చాను. రీసెంట్‌గా ఆయ్ మూవీ చేశాను. అది చాలా కామెడీ ఓరియెంటెడ్ మూవీ. కానీ ఈ వికటకవి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. కంటెంట్‌ను బట్టే మ్యూజిక్ కూడా వస్తుంది. మా సిరీస్ నవంబర్ 28న జీ5లో రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

కెమెరామెన్ షోయబ్ మాట్లాడుతూ.. ‘వికటకవి కోసం నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రదీప్‌కు థాంక్స్. ఈ సిరీస్ కోసం చాలా కొత్తగా ట్రై చేశాం. అదేంటో నవంబర్ 28న చూడండి’ అని అన్నారు.

Vikkatakavi On ZEE 5 Press Meet
Vikkatakavi On ZEE 5 Press Meet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here